డబల్ సర్ప్రైజ్ లు ఇవ్వనున్న బాలయ్య...

గాడ్ ఆఫ్ మాసెస్ గా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ బర్త్ డే కి డబుల్…ట్రిపుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారా? 109.110వ చిత్రాలకు సంబంధించిన అప్ డేట్ ఆ రోజున రాబోతుందా? వాటితో పాటు 108 ట్రీట్ డబుల్ కిక్క్ ని ఇవ్వబోతుందా? అంటే అవుననే ప్రచారం మొదలైంది.ఇప్పటికే బాలకృష్ణ 109.110వ చిత్రాలకు సంబంధించి చర్చలు జోరుగా సాగుతున్నాయి.పలు దర్శకులతో బాలయ్య చర్చలు జరుపుతున్నారు.కొన్ని స్టోరీలు లాక్ చేసి పెట్టారు.ఈ రేసులో సీనియర్ దర్శకులతో పాటు యువ దర్శకులున్నారు.ఆ వివరాలేంటో తెలుసుకొందాం…

 Balakrishna Movies Update , Balakrishna, Tollywood, Akhanda 2 , Boyapati Sri-TeluguStop.com

వివరాల్లోకి వెళ్ళితే,బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ( Mokshagna ) పేరు కూడా వినిపిస్తుంది.

ఆయన హీరోగా నటించనున్న సినిమాతోనో? మోక్షని లాంచ్ చేయాలని భావిస్తున్నారు.అది 109వ చిత్రమా? 110వ చిత్రంతోనా? అన్నది ఇంకా క్లారిటీ లేదు.అయితే మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం ఈ సంవత్సరంలోనే ఉంటుంది అని ఫాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు,ఇలా రకరకాల సందేహాల నడుమ ఆ రెండు చిత్రాలు నలుగుతున్నాయి.అదే కనుక జరిగితే నందమూరి అభిమానులకి పండగే అని చెప్పొచ్చు.

 Balakrishna Movies Update , Balakrishna, Tollywood, Akhanda 2 , Boyapati Sri-TeluguStop.com
Telugu Akhanda, Anil Ravipudi, Balakrishna, Boyapati Srinu, Mokshagna, Tollywood

జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా వాటన్నింటి పై వివరణ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.ఏపీలో 2024 ఎన్నికలు సమీపిస్తో న్న నేపథ్యంలో 109వ సినిమా ‘అఖండ-2′ అయితే బాగుంటుందని.అందుకోసం బోయపాటి అయితేనే కరెక్ట్ అని అభిమానులు సైతం భావిస్తున్నారు.ప్రస్తుతం బోయపాటి రామ్ పోతినేని తో ఊరమాస్ సినిమా చేస్తున్నాడు, అది కంప్లీట్ ఐతేగాని బోయపాటి బాలయ్య కాంబినేషన్ మీద ఒక అంచనాకి రావొచ్చు.

Telugu Akhanda, Anil Ravipudi, Balakrishna, Boyapati Srinu, Mokshagna, Tollywood

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే ‘అఖండ-2′ చేస్తే బాగుంటుందని ఇప్పటికే నెట్టింట కథనాలు వెడెక్కిస్తు న్నాయి.అయితే వీటన్నింటిపై గాడ్ ఆఫ్ మాసెస్ అతి కొద్దీ రోజులలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్ జోరుగా ప్రచారం సాగుతోంది.బాలయ్య పుట్టిన రోజు వేడుకలు అంటే అంబరాన్ని అంటాల్సిందే.ప్రతీ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహిస్తారు.అందులోనూ అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తుంటారు.

వాళ్ల కోసం సమ్ థింగ్ స్పెషల్ గా సినిమా అనౌన్స్ మెంట్స్ లాంటివి ఇచ్చి తృప్తి పరచడం బాలయ్య ప్రత్యేకత.

మరి ఈసారి అదే సన్నివేశాన్ని రిపిటీ్ చేస్తారా? కొత్తగా ఇంకేదైనా చేస్తారా? అన్నది వేచి చూడాలి.ప్రస్తుతం 108వ సినిమా అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తోన్న సంగతి మన అందరికి తెలిసిందే.

ఆ సినిమా టీజర్ సైతం ఆరోజున రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.మరి అనుకున్న అప్ డేట్స్ అన్ని జూన్ 10న వస్తే గనుక అభిమానుల ఆనందానికి అవధులుండవ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube