నవశకం( Navasakam ) బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ.( Nandamuri Balakrishna ) వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అయిందని విమర్శించారు.రాబోయే ఎన్నికలలో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఇది లోకేష్ యువగళం పాదయాత్ర.( Yuvagalam ) ముగింపు సభ కాదు.
వైసీపీకి అంతిమయాత్ర అని అభివర్ణించారు.ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధిని నిర్వీర్యం చేసి అప్పులు ఎక్కువ చేసేసారు అని అన్నారు.
వైసీపీ పాలనలో ధరలు, పన్నులు ఆకాశాన్నంటాయి.
సామాన్యుడి జీవనం ప్రశ్నార్థకంగా మారింది.
ఈ క్రమంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను కూడా వేధించారు.
పోలీసులు, ఉద్యోగులు, కార్మికులను ఈ ప్రభుత్వం వేధిస్తోంది.రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవు.
మరోసారి వైసీపీ( YCP ) గెలిస్తే ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ ఉండదు.జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) చూపించేది కపట ప్రేమ.
సవతి తల్లి ప్రేమ… దయచేసి ఎవరూ నమ్మొద్దు.
రాష్ట్రంలో ఉపాధి లేక ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు.వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది.
సమయం లేదు మిత్రమా.విజయమా వీర స్వర్గమా.
అనే పరిస్థితి ఉంది.ఉచిత పథకాల మోజులో ప్రజలు పడొద్దు.
వచ్చే ఎన్నికలలో సుపరిపాలనకు స్వాగతం పలకాలి.ఎవరికి భయపడాల్సిన పనిలేదు.
రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రజలంతా నడుంబించాలి.
మీరు ముందడుగు వేయండి ఎవరు అడ్డోస్తారో మేము చూస్తామంటూ బాలయ్య సంచలన స్పీచ్ ఇవ్వడం జరిగింది.ఇదే సభలో పవన్ కళ్యాణ్ పై బాలకృష్ణ పొగడ్తల వర్షం కురిపించారు.సోదర సమానుడు పవన్( Pawan Kalyan ) ఒకపక్క తన జీవితాన్ని సినిమాకే కాకుండా ప్రజా సమస్యలపై పోరాడటానికి అధికంగా కేటాయిస్తున్నారని కొనియాడారు.
రాష్ట్రంలో అనేక సమస్యలపై తిరుగులేని పోరాటం చేశారని ప్రశంసించారు.