Balakrishna Rana : అమరేంద్ర బాహుబలి పాత్రలో బాలయ్య.. రానా చేసిన ఈ కామెంట్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!

బాహుబలి, బాహుబలి2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలలో ప్రభాస్ బాహుబలి( Baahubali ) పాత్ర కోసం ఎంతో కష్టపడి ఊహించని స్థాయిలో న్యాయం చేశారు.

బాహుబలి2 సాధించిన సంచలన రికార్డులు ఇప్పట్లో బ్రేక్ కావడం సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాజమౌళి తన రికార్డ్ లను తానే బ్రేక్ చేయడం సులువు కాదని కామెంట్లు వినిపించాయి.

అయితే గతంలో ఒక సందర్భంలో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ లలో అమరేంద్ర బాహుబలి పాత్ర( Amarendra Baahubali ) ఎవరికి సూట్ అవుతుందని రానాకు ప్రశ్న ఎదురు కాగా రానా బాలయ్య పేరు సమాధానం చెప్పుకొచ్చారు.బాలయ్యకు( Balakrishna ) పురాణాలపై పట్టు ఉండటంతో ఆయనను ఎంచుకోవడం జరిగిందని రానా ( Rana ) కామెంట్లు చేయడం గమనార్హం.

బాలయ్యకు సైతం అన్ని రకాల పాత్రలను పోషించాలని నటుడిగా ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలనే ఆకాంక్ష ఉంది.బాలయ్యతో అద్భుతమైన కంటెంట్ తో సినిమా తీస్తే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.చెంగీజ్ ఖాన్ కథలో నటించాలని ఉందని బాలయ్య పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Advertisement

బాలయ్య ప్రస్తుతం బాబీ( Bobby ) డైరెక్షన్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో బాలయ్య బంధిపోటుగా కనిపిస్తారని సమాచారం అందుతోంది.బాలయ్య రోల్ కొత్తగా ఉంటుంది.బాలయ్య ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను మించేలా ఈ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్న బాలయ్య బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తారేమో చూడాలి.బాలయ్య, రానా కాంబినేషన్ లో మహానాయకుడు సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదనే సంగతి తెలిసిందే.

యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ అదిరిపోయే తీపికబురు.. అలా చెప్పి షాకిచ్చారుగా!   
Advertisement

తాజా వార్తలు