శ్రీలీలకు బాలయ్య వల్ల పెద్ద సమస్యే వచ్చిందిగా.. అయ్యో పాపం అంటూ?

స్టార్ హీరో బాలకృష్ణ ( Balakrishna ) మనస్సు మంచి మనస్సు అనే సంగతి తెలిసిందే.కుటుంబ సభ్యులకు బాలయ్య ఇచ్చే ప్రాధాన్యత అంతాఇంతా కాదు.

 Balakrishna Created New Problems To Srileela Details, Balakrishna, Srileela, Dir-TeluguStop.com

కుటుంబ సభ్యులకు ఏ చిన్న కష్టం వచ్చినా బాలయ్య అస్సలు తట్టుకోలేరు.తారకరత్న మరణం బాలయ్యను ఎంతగానో బాధ పెట్టింది.

తారకరత్న ఆస్పత్రిలో ఉన్న సమయంలో కూడా బాలయ్య రేయింబవళ్లు ఆస్పత్రికే పరిమితం అయ్యారనే సంగతి తెలిసిందే.ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ బాలయ్య యాక్టివ్ అవుతున్నారు.

అయితే బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాలో శ్రీలీల( Srileela ) బాలయ్య కూతురిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.అయితే దసరా కానుకగా శ్రీలీల నటిస్తున్న మరో పెద్ద సినిమా కూడా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

ఆ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ కావడం గమనార్హం.సంక్రాంతికి విడుదలైన రెండు సినిమాలలో శృతి హాసన్ కామన్ హీరోయిన్ కాగా దసరా సినిమాలలో శ్రీలీల కామన్ హీరోయిన్ కావడం గమనార్హం.ఒకే సమయంలో రెండు పెద్ద సినిమాలలో నటించిన హీరోయిన్ కు ఆ రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే ఇబ్బందులు తప్పవు.అయితే రిలీజ్ డేట్లకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

శ్రీలీల బాలయ్య కాంబినేషన్ లో కొన్ని సీన్లు ఎమోషనల్ గా ఉంటే మరికొన్ని సీన్లు ఫన్నీగా ఉంటాయని బోగట్టా.బాలయ్య శ్రీలీల బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా, శ్రీలీల తల్లి పాత్రలో కాజల్ ( Kajal ) కనిపించనున్నారని సమాచారం.ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని సమాచారం అందుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube