ఆ గ్రామంలో కలవబోతున్న బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

ఈ మధ్య కాలంలో బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించలేదు.గతేడాది బాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం టీడీపీకి ప్లస్ కావచ్చని అదే సమయంలో మైనస్ కూడా కావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Balakrishna And Ntr Along With Nandamuri Family To Meet At Nimmakuru Details, Junior Ntr, Nandamuri Balakrishna, Senior Ntr, Ntr Shatajayanthi, Nandamuri Family, Kalyan Ram, Taraka Ratna, Nimmakuru-TeluguStop.com

ఆ సమయంలో బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే ఎన్టీఆర్ మాత్రం బాలయ్య గురించి పాజిటివ్ గానే కామెంట్లు చేస్తూ వచ్చారు.

బాల బాబాయ్ అంటూ అఖండ సినిమా విడుదలైన సమయంలో మరికొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ ప్రశంసించారు.అయితే అతి త్వరలో నిమ్మకూరు గ్రామంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నారని సమాచారం అందుతోంది.

 Balakrishna And Ntr Along With Nandamuri Family To Meet At Nimmakuru Details, Junior Ntr, Nandamuri Balakrishna, Senior Ntr, Ntr Shatajayanthi, Nandamuri Family, Kalyan Ram, Taraka Ratna, Nimmakuru-ఆ గ్రామంలో కలవబోతున్న బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసే ఛాన్స్ ఉంది.బాబాయ్ అబ్బాయ్ కలిసి ఒకే చోట కనిపిస్తే అభిమానులకు అంతకు మించిన సంతోషం అయితే ఉండదని చెప్పవచ్చు.

నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేయాలని ఫిక్స్ అయ్యారు.

నందమూరి ఫ్యామిలీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందుకు సంబంధించిన ఆహ్వానం అయితే అందనుందని తెలుస్తోంది.సీనియర్ ఎన్టీఆర్ 1923 సంవత్సరంలో జన్మించిన సంగతి తెలిసిందే.మే నెల 28వ తేదీన నిమ్మకూరు గ్రామంలో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యే ఛాన్స్ అయితే ఉంది.

కళ్యాణ్ రామ్, తారకరత్న కూడా ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశాలు అయితే ఉంటాయని ప్రచారం జరుగుతోంది.టీడీపీ ముఖ్య నేతలు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు.అందువల్ల తారక్ ఈ ఉత్సవాలకు హాజరయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.తారక్ తర్వాత మూవీ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube