టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమాలో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా ఈ నెల 20వ తేదీన హిందీలో విడుదలైంది.అఖండ హిందీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా ఈ సినిమా కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగా లేకపోవడం బాలయ్య ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.
500కు పైగా స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కాగా ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు 40 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయని తెలుస్తోంది.ఈ సినిమా రిలీజైన థియేటర్ల సంఖ్యతో పోల్చి చూస్తే ఈ మొత్తం చాలా తక్కువని తెలుస్తోంది.ఈ సినిమాకు సరైన స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోవడంతో పాటు బాలయ్యకు డబ్బింగ్ సూట్ కాకపోవడం కూడా ఈ సినిమాకు ఒకింత మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అఖండ సినిమా హిందీలో కూడా అంచనాలకు మించి హిట్ గా నిలుస్తుందని భావించిన అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి.పెన్ స్టూడియోస్ నిర్మాతలు హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేయగా ప్రమోషన్స్ పై మరింత దృష్టి పెట్టి ఉంటే మాత్రం ఈ సినిమా బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హిందీలో బాలయ్యకు లక్ కలిసిరాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
శివతత్వం కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కగా పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసి ఉండేది.
హిందీలో ఈ సినిమాకు ఏ స్థాయిలో కలెక్షన్లు సొంతమవుతాయో చూడాల్సి ఉంది.బాలయ్య హిందీ డబ్బింగ్ చెప్పి ఉంటే మాత్రం అఖండ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించి ఉండేది.
హిందీలో పాజిటివ్ రివ్యూలు వచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ సినిమా రిజల్ట్ మారుతుందేమో చూడాలి.