కరోనా వల్ల 2020 మరియు 2021 సంవత్సరంలో సినిమా పరిశ్రమ కొన్ని వేల కోట్ల రూపాయలను నష్టపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా కరోనా వల్ల నష్టపోయినా సినిమా ఇండస్ట్రీ ఎక్కువగా నష్టపోయింది అనేది మాత్రం కన్ఫర్మ్.2020 సంవత్సరంలో మార్చి వరకు సినిమాల విడుదల సాగాయి.ఆ తర్వాత పెద్ద సినిమా ల ఊసే కనిపించలేదు.2021 లో అంటే ఈ ఏడాది ఆరంభంలో సినిమా లు విడుదల అయ్యాయి.కాని అనూహ్యంగా సెకండ్ వేవ్ రావడంతో వెంటనే నిలిచి పోయాయి.2021 ఆరంభంలో వచ్చిన కొన్ని తెలుగు సినిమాలు మెప్పించాయి.అందులో ఉప్పెన ఒకటి.
ఉప్పెన సినిమా వంద కోట్లు అన్నట్లుగా ప్రచారం జరిగింది కాని వంద కోట్లకు కాస్త దూరంలోనే ఆ సినిమా నిలిచి పోయింది.ఈ ఏడాది లో వంద కోట్లు సాధించిన ఇండియన్ సినిమా లు రెండే రెండు అందులో మొదటిది బాలీవుడ్ మూవీ సూర్యవంశీ.

ఆ సినిమా దాదాపుగా 300 కోట్ల వరకు వసూళ్లు సాధించింది అంటున్నారు.ఆ తర్వాత మన బాలయ్య నటించిన అఖండ సినిమా.అద్బుతమైన బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఇటీవలే వంద కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.లాంగ్ రన్ లో 110 కోట్ల రూపాయలను తీసుకు వస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
సౌత్ లో చాలా సినిమాలు విడుదల అయ్యాయి కాని ఈ రెండు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ ను షేర్ చేశాయి.ఈ ఏడాది ఇంకా 15 రోజులు మిగిలే ఉన్నాయి.
ఈ పది హేను రోజుల్లో 10 సినిమాలకు పైగా రాబోతున్నాయి.అందులో కూడా వంద కోట్ల సినిమాలు ఉండవచ్చు అంటున్నారు.
మొత్తానికి అయితే ఇప్పటి వరకు ఈ ఏడాదికి వంద కోట్ల సినిమాలు అంటే కేవలం సూర్య వంశీ మరియు అఖండలు మాత్రమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.







