అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన బలగం... ఏకంగా రెండు అవార్డులు కైవసం!

Balagam Movie Wins Best Director And Best Cinematography Awards Details, Dil Raju,Balagam,Priyadarshi,Kavya Kalyan Ram, Director Venu Yeldandi, Acharya Venu, Los Angeles Cinematography Awards

ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది.స్టార్ హీరోస్ భారీ బడ్జెట్ సినిమాలను ఏమాత్రం ఇష్టపడటం లేదు.

 Balagam Movie Wins Best Director And Best Cinematography Awards Details, Dil Raj-TeluguStop.com

కంటెంట్ ఉంటే చిన్న సినిమానైనా పెద్ద ఎత్తున ఆదరిస్తూ చిన్న సినిమాలకు కూడా పట్టం కడుతున్నారు.ఇలా ఎన్నో చిత్రాలు చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాలను అందుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఈ క్రమంలోనే అలాంటి విజయాన్ని అందుకున్నటువంటి వాటిలో బలగం(Balagam) సినిమా ఒకటి.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంలా తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా మార్చి మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విధంగా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా కేవలం మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.ఇక ఈ సినిమాకు జబర్దస్త్ కమెడియన్ వేణు(Venu) డైరెక్టర్ గా వ్యవహరించారు.ఇలా సినిమాపై ఉన్న మక్కువతో ఈయన మెగా ఫోన్ పట్టి బలగం సినిమాని తెరకెక్కించారు.ఇలా మొదటి సినిమాని ఇంత మంచి సక్సెస్ కావడంతో ఎంతోమంది ఈయనకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మరికొన్ని అవకాశాలను కూడా కల్పించారు.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలు ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా అంతర్జాతీయ వేదికపై కూడా సప్త చాటింది.

సినిమా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులలో భాగంగా బలగం సినిమా ఏకంగా రెండు అవార్డులను అందుకుంది.ఈ క్రమంలోనే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి గాను డైరెక్టర్ వేణు అవార్డును అందుకోగా, బెస్ట్ ఫీచర్ ఫిలిం సినిమాటోగ్రఫీ విభాగానికి గాను ఆచార్య వేణు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.ఇలా ఈ సినిమా ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఈ విజయంపై ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులు స్పందిస్తూ శుభకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఈ సినిమా దిల్ రాజు (Dil Raju)నిర్మాణంలో తెరకెక్కగా ఇందులో కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) ప్రియదర్శి(Priyadarshi) జంటగా నటించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube