గంగోత్రి( Gangotri ) లాంటి సినిమాతో వెండితెరపై బాలనటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి కావ్య కళ్యాణ్ రామ్( Kaya Kalyan Ram ) రీసెంట్ గా ఈమె బలగం సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.ప్రస్తుతం హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇలా నటిగా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయారు.బలగం సినిమాతో ఒక్కసారిగా ఎంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి ఈమె త్వరలోనే ఉస్తాద్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు…
సినిమా( Ustaad Movie ) షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని ఆగస్టు 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ సినిమా గురించి చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా నటి కావ్య తన గురించి వస్తున్నటువంటి రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
గత రెండు రోజులుగా కావ్య గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది…
ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నటి కావ్య పట్ల కొందరు దర్శకులు చాలా ఇబ్బందికరంగా వ్యవహరించారని అలాగే తనని బాడీ షేమింగ్( Body Shaming Comments ) ట్రోల్స్ చేశారంటూ పెద్ద ఎత్తున ఈమె గురించి వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలపై స్పందించినటువంటి ఈమె ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టారు.ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కావ్య స్పందిస్తూ…
కొన్ని మీడియా సంస్థలలో నాపై దర్శకులు బాడీ షేమింగ్‌కి పాల్పడ్డారని నేను చెప్పినట్లుగా కథనాలను గమనించాను.నేనలా ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు.ఆ కథనాలు నిజం కావు.
ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.థ్యాంక్యూ అంటూ కావ్య కళ్యాణ్ రామ్ తన సోషల్ మీడియా( Social Media ) వేదికగా తన గురించి వస్తున్నటువంటి రూమర్లపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
దీంతో ఈ వార్తలకు పుల్ స్టాప్ పడినట్టు అయింది…
అయితే కొన్ని మీడియా చానెల్ లు ఉన్నది లేనట్టుగా రాయడం తనని బాగా ఇబ్బంది పెడుతుంది అని అందుకే తన మీద వచ్చిన రూమర్ కి పుల్ స్టాప్ పెట్టడానికే తను ఇది చెప్తున్నాను అని క్లారిటీ ఇచ్చారు…
.