కొంతమంది తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.అలా ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలు అందుకున్న నటులలో బాలాదిత్య ఒకరు.
బిగ్ బాస్ షో సీజన్6 ద్వారా ఆడియన్స్ కు మరింత దగ్గరైన బాలాదిత్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా పేరెంట్స్ నన్ను ఏ విషయంలో ఫోర్స్ చేయలేదని తెలిపారు.ఇంటర్ తర్వాత సినిమాల్లోకి రావాలని భావించానని ఆయన అన్నారు.
2009లో ఎడ్యుకేషన్ కోసం బ్రేక్ తీసుకోవాలని అనుకున్నా పేరెంట్స్ వద్దని చెప్పలేదని బాలాదిత్య తెలిపారు.సీఏ, సీఎస్ కోర్సులు చేయాలంటే ఎక్కువ సమయం కేటాయించాలని సూచించడంతో నేను ఎంతో కష్టపడి ఆ కోర్సులను పూర్తి చేశానని బాలాదిత్య వెల్లడించారు.
హీరోగా చేసిన తర్వాత చదువుకోవడం కష్టమని అయినప్పటికీ నేను చదివానని ఆయన కామెంట్లు చేశారు.ఆ తర్వాత నేను సినిమాల్లో ఆఫర్ రాకపోవడంతో టీచింగ్ కు వెళ్లానని బాలాదిత్య తెలిపారు.
2016లో నా మ్యారేజ్ జరిగిందని బాలాదిత్య కామెంట్లు చేయడం గమనార్హం.నేను, సుహాసిని కలిసి రెండు సినిమాలలో నటించామని బాలాదిత్య చెప్పుకొచ్చారు.
అప్పట్లో వైరల్ అయిన మ్యారేజ్ వార్తల గురించి బాలాదిత్య స్పందిస్తూ ఆ విధంగా వార్తలు వినిపించాయని అయితే నేను, సుహాసిని ఇప్పటికీ మంచి స్నేహితులమని అన్నారు.వైరల్ అయిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని బాలాదిత్య స్పష్టం చేశారు.ఫ్యామిలీ లెవెల్ లో మేము స్నేహితులమని చాలా తక్కువ సమయంలో రెండు సినిమాలలో కలిసి నటించామని ఆయన అన్నారు.నా కారులో తను, తన కారులో నేను ప్రయాణం చేయడం వల్ల కూడా ఆ గాసిప్స్ ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చని బాలాదిత్య పేర్కొన్నారు.
ఒక పేపర్ లో వచ్చిన ఆర్టికల్ వల్ల ఈ వార్త వినిపించిందని ఆయన తెలిపారు.