బాహుబలి, ఆర్ఆర్ఆర్, ధమాకా.. రవితేజ ఖాతాలో అరుదైన రికార్డ్ చేరిందా?

గత కొన్నేళ్లలో థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య ఊహించని స్థాయిలో తగ్గింది.ఫస్ట్ వీకెండ్ తర్వాత సినిమాల కలెక్షన్లు అమాంతం తగ్గుతున్నాయి.ఈ రీజన్ వల్లే ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయడంపై మేకర్స్ దృష్టి పెడుతున్నారు.10 రోజుల్లో ధమాకా మూవీ ఏకంగా 89 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని తెలుస్తోంది.

 Baahubali Rrr Dhamaka 10th Day Share Collections Details Here Goes Viral , Baa-TeluguStop.com

10వ రోజు ఈ సినిమా ఏకంగా 3.5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.బాహుబలి, బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్ సినిమాల తర్వాత పదో రోజు ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న మూవీ ఏదనే ప్రశ్నకు ధమాకా పేరు సమాధానంగా వినిపిస్తోంది.వాస్తవానికి ధమాకా సినిమాకు వచ్చిన టాక్ కు ఈ సినిమా సాధించిన కలెక్షన్లకు ఏ మాత్రం పొంతన లేదనే సంగతి తెలిసిందే.

అయితే అదృష్టం కలిసొచ్చి ఈ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవడం సాధ్యమైంది.శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకు ప్లస్ అయింది.ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అటు నిర్మాతలకు ఇటు బయ్యర్లకు ఈ సినిమా భారీ లాభాలను అందిస్తోంది.

ఈ సినిమాలోని మాస్ పాటలు ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తున్నాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.శ్రీలీల డ్యాన్స్ లు కూడా ఈ మూవీ సక్సెస్ కు కారణమయ్యాయి.

మాస్ ప్రేక్షకులకు నచ్చితే రొటీన్ కథలతో కూడా సక్సెస్ సాధించవచ్చని ధమాకా మూవీతో రవితేజ మరోసారి ప్రూవ్ చేశారు.ఈ సినిమాలోని ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.

పదో రోజు ధమాకా సాధించిన షేర్ కలెక్షన్లతో రవితేజ ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube