ముఖ్యమంత్రి ఇంటి పక్కనే తాడేపల్లి లో రెండు పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అది వారి అక్కసుకు నిదర్శనమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ధ్వజమెత్తారు.తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల సైకిల్, కాంగ్రెస్ పాలనను నాశనమైన ప్రభుత్వ పాఠశాలకు ఇది నిదర్శనమని వారు చెప్పి ఉంటే బాగుండేదన్నరు.
రాష్ట్రంలో పేదరికం అది శాశ్వతంగా పోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెస్తున్నారన్నారు.
పేదవాడికి విద్యను పూర్తిగా ఉచితంగా అందించాలిని కంకణం కట్టుకొని ముఖ్యమంత్రి పనిచేస్తుంటే ఇంత నీచంగా వ్యవహరించడం సరికాదన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 57 వేల ప్రభుత్వ బడులను మనబడి నాడు-నేడు కార్యక్రమంతో అభివృద్ధి చేస్తున్నారని మొదటి దశలో దాదాపు రూ.3700 కోట్లు ఖర్చు చేసి 15,715 పాఠశాలను అభివృద్ధి చేశారన్నారు.స్కూల్లో అభివృద్ధికి ఏకంగా 16 నుంచి 17 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు.ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల నేడు సర్కార్ బడులకు డిమాండ్ పెరిగిందన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో నోవేకెన్సీ బోర్డులు పెట్టి విద్యార్థులకు క్యూ కట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది అభివృద్ధిలా కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు వల్ల ప్రతి ప్రతి బిడ్డలోను, ప్రతి తల్లిలోను ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపారు.చంద్రబాబు అధికారంలో ఉండగా కరెంటు బకాయిలు కట్టలేదని రైతులకు అక్రమ కేసులు పెట్టి స్పెషల్ పోలీస్ స్టేషన్ పెట్టి వేధించిన విధంగా ఇప్పుడు పాలన లేదన్నారు.పేద విద్యార్థుల కోసం పేదల కోసం రైతన్న కోసం సీఎం జగన్ ఎంత చేస్తున్నా తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలికి మీడియాకు తక్కువగానే కనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు.
ఇకనైనా ఇటువంటి కుట్రలు మానుకోవాలని హితవు పలికారు.