కృతి శెట్టి సూపర్ ప్లాన్.. నెలకు ఒక సినిమా విడుదల?

ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి నక్క తోక తొక్కి వచ్చింది అన్న విషయం తెలిసిందే.ఎందుకంటే ఎంతో మంది హీరోయిన్లకు సినిమాల్లో సక్సెస్ రావడానికి చాలా సమయం పడుతుంది.

 Back To Back Movies Of Kriti Shetty Kriti Shetty, Tollywood, Uppena ,shyanm Sing-TeluguStop.com

కానీ అటు కృతి శెట్టికీ మాత్రం ఒక్క సినిమాతోనే మంచి సక్సెస్ వచ్చి అందరూ దర్శకనిర్మాతలు ఆకర్షించింది.మొదటి సినిమా తర్వాత ఎలాంటి గ్యాప్ లేకుండానే వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

అంతేకాదు ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతూ ఉండడంతో ఇక అంతకంతకు క్రేజ్ కూడా పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే.

ఉప్పెన సూపర్ డూపర్ హిట్ తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఆ తర్వాత బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు హ్యాట్రిక్ కొట్టింది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఈ సొగసరి చేతిలో ఆ అమ్మాయి గురించి నీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం, ద వారియర్ లాంటి సినిమాలు ఉన్నాయి.

ఈ మూడు సినిమాలు కూడా వరుసగా విడుదలకు సిద్ధమవు
తున్నాయి అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో కృతి శెట్టి నెలకు ఒక సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది అని తెలుస్తుంది.

Telugu Bangarraju, Kriti Shetty, Nagachaitanya, Nagarjuna, Nithin, Sudheer Babu,

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు కు జోడిగా కృతి శెట్టి నటిస్తోంది.జూన్ నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక అదే సమయంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది కృతి.

లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమా జూలై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే.

నితిన్ హీరోగా ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12వ తేదీన విడుదల కాబోతుంది.ఇలా జూన్ జూలై ఆగస్టు నెలల్లో వరుసగా నెలకొక సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది కృతిశెట్టి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube