మూడు దశాబ్దాల క్రితం హీరోయిన్ గా అంత కంటే ముందు బేబీ వరలక్ష్మి గా పాపులర్ అయ్యారు సీనియర్ నటి వరలక్ష్మి.వరలక్ష్మి అంటే గుర్తుపట్టడం చాలా కష్టం, ఎందుకంటే ఆమె నటించిన సమయంలో చాలా మంది వరలక్ష్మీ అనే నటీమణులు ఉండేవారు.
రేపుల వరలక్ష్మి, బేబీ వరలక్ష్మి అంటే మాత్రమే ఆమెను గుర్తుపట్టగలరు.చాలా రోజులుగా మీడియాకు, టీవీకి, సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వరలక్ష్మి ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ సమయంలో చిన్నతనంలో సినిమాల్లో నటించడం వల్ల ఆమె ఒంటికైనా గాయాల గురించి చెప్తూ బాధపడ్డారు.వరలక్ష్మి సినిమాలో నటిస్తుంది అంటే ఆమెను ఎంత ఎక్కువగా పరిగెత్తిస్తే అంత బాగా సినిమా హిట్ అవుతుంది అని దర్శక నిర్మాతలు అప్పట్లో భావించేవారు.
ఆ మధ్య కాలంలో ఇలా వరలక్ష్మి పరిగెత్తడం అనే ఒక సెంటిమెంటు బలంగా ఉండేది.ఇక వరలక్ష్మి నటిస్తున్న టైం లో హైదరాబాద్ లో మరియు చెన్నైలో దాదాపు అన్ని రోడ్లు పరిగెత్తాను అంటూ సరదాగా చెప్పారు.
వరలక్ష్మికి ఎక్కువగా నటిస్తున్న టైం లోనే గాయాలు కూడా బాగా అయ్యాయట.

ఆమె ఒంటిలో ఇప్పటికీ ఆ గాయాల తాలూకు మచ్చలు ఉండడం గమనించాల్సిన విషయం.స్వర్గం సినిమాలో సీనియర్ నటి వరలక్ష్మి చిన్న పిల్లగా ఉన్న బేబీ వరలక్ష్మిని కొట్టాల్సిన సన్నివేశం ఉండగా ఆమె కొట్టిన కొట్టుడుకి కళ్ళు తిరిగి పడిపోవడం మాత్రమే కాదు బేబీ వరలక్ష్మి కి దవడ వాచిపోయిందట.ఇక ఎక్కువగా రేప్ సన్నివేశాలు నటించడం వల్ల షిఫాన్ చీరలు, ఓణీలు వేసుకోవడం అప్పట్లో అలవాటుగా ఉండేదట.

అందువల్ల అదిలాగే ప్రయత్నం చేస్తున్నప్పుడు అనేకసార్లు చర్మం వోలుచుకుని వచ్చేదంటూ ఆవిడ ఎమోషనల్ అయ్యారు.ఒకసారి చనిపోయినట్టుగా నటించాల్సిన సన్నివేశంలో నిర్మలమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెపై పడాల్సి ఉంది.ఆమె పడిన ఫోర్స్ వల్ల చేతికి ఉన్న గాజులు పగిలిపోయి వరలక్ష్మి చేతిలోకి గుచ్చుకున్నాయంట.కానీ కదులితే సన్నివేశం పాడవుతుందని చేతిలోకి గాజు పెంకులు గుచ్చుకున్న కూడా అలాగే నటించారట.
అలా ఆమె శరీరంలో అనేక వందల మచ్చలు అలాగే మిగిలిపోయాట.