కాలీఫ్లవర్‌లో రెస్ట్ తీసుకుంటున్న కట్లపాము.. ఫ్యూజులు ఎగిరిపోయాయి

మనం నిత్యం వినియోగించే కూరగాయలు పొలాల నుంచి వస్తుంటాయి.రైతులు వీటిని కోస్తున్నప్పుడు అన్ని విషయాలు పట్టించుకోరు.

 Baby Snake In Cauliflower Video Goes Viral Details, Snake, Latest News, Viral L-TeluguStop.com

అయితే కూరగాయలు విక్రయించే వారు మాత్రం వాటిని పట్టించుకోవాలి.అందులో ఏమైనా పురుగు పుట్ర ఉన్నాయేమోనని పరిశీలించాలి.

కనీసం కూరగాయలు కొనే వారు అయినా వాటిని పరిశీలించి కొనుగోలు చేయాలి.లేకుంటే కొన్ని అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

ఇదే కోవలో ఓ వ్యక్తి తాజాగా కూరగాయలు కొనేందుకు వెళ్లాడు.అక్కడ కాలీ ఫ్లవర్( Cauliflower ) బేరం ఆడి తీసుకున్నాడు.

అయితే దానిని పరిశీలించగా షాకింగ్ విషయం బయటపడింది.

కాలీ ఫ్లవర్ సంగతి దేవుడు ఎరుగు.ప్రాణం పోయినంత పనైందని ఆ వ్యక్తి భయపడ్డాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కూరగాయల్లో ఒక్కో సారి పురుగులు వంటివి ఉంటాయి.అయితే వాటిని ఇంటికి తెచ్చి కోస్తున్నప్పుడు అవి బయటపడుతుంటాయి.

పురుగులు అయితే పర్వాలేదు.అందులో పాము( Snake ) ఉంటే ఇక అంతే సంగతులు.

ఇలాంటి భయంకరమైన అనుభవం ఇటీవల ఓ వ్యక్తికి ఎదురైంది.కాలీఫ్లవర్ కొనుగోలు చేస్తుండగా అందులో ఓ కట్లపాము కనిపించింది.

చాలా చక్కగా అది రెస్ట్ తీసుకుంటోంది.

దీంతో దానిని కొనుగోలు చేసే వ్యక్తి భయంతో వెనుకడుగు వేశాడు.దేవేంద్ర సైనీ( Devendra Saini ) అనే యూజర్ ఈ వీడియోను ఆగస్టు 4న తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.“ఇది ఏ రకం కాలీఫ్లవర్? కోబ్రా కాలీఫ్లవర్( Cobra Cauliflower ) లేదా వైపర్ కాలీఫ్లవర్.” అని క్యాప్షన్ ఇచ్చాడు.కాలీ ఫ్లవర్ ఒక్కొక్క మొగ్గ తొలగిస్తుండగా ఆ పాము బయటపడింది.

మెల్లగా ఆ పాము టేబుల్‌ పైకి జారింది.అతను పాము పిల్లను బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడు, అది మరొక వైపుకు జారిపోయి మొగ్గలలో చిక్కుకుపోతుంది.

ఇప్పుడు, వేరే మార్గం కనిపించక, ఆ వ్యక్తి కాలీఫ్లవర్ మొగ్గలను ఒకదాని తర్వాత ఒకటి తీసివేస్తాడు.దీంతో ఆ పాము కాలీఫ్లవర్ నుండి కూరగాయలను ఉంచిన టేబుల్‌లోకి జారడానికి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube