ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఫేస్ బుక్ వాడుతూ ఉన్నారు.
పొద్దన లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు గంటల కొ్ద్ది ఫేస్ బుక్ లో గడుపుతున్నారు.పోస్ట్ ల ద్వారా తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు.
ఇక తమ ఫొటోలను పోస్ట్ చేయడంతో పాటు కామెంట్స్, లైక్ లు కొడుతూ ఫేస్ బుక్ లో గడుపుతున్నారు.ఇక ఫేస్ బుక్ పాతది అవ్వడతో ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి వాటిని కూడా ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు.
ఇక ఫేస్ బుకు లో ఫ్రెండ్స్ తో గంటలు గంటలు ఛాటింగ్ చేస్తూ ఉంటారు.
ఫేస్ బుక్ వాడే ప్రతిఒక్కరికీ ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ గురించి తెలిసే ఉంటుంది.
అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆయనను పొలిన ఒక బాల జీసస్ శిల్పం సోషల్ మీడియలో చక్కర్లు కొడుతుంది.
లాస్ ఏంజిల్స్ లోని మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ఓ శిల్పం ఆకట్టుకుంటోంది.ఇందులో బాల జీసస్ ను మదర్ మేరీ తన చేతుల్లో పట్టుకున్నట్లు ఉంది.

అయితే ఆ శిల్పంలో బాల జీసస్ మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ను పోలి ఉన్నాడు.దీంతో కొంతమంది దీనిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.మాజీ ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సి కూడా దీనిపై స్పందించడంతో ఫొటో వైరల్ గా మారింది.ఈ చిత్రాన్ని ఆయన తన ట్విట్టర్ లో షేర్ చేసి బేబీ జీసస్ శిల్వం మార్క్ జుకర్ బర్గ్ లా ఉంది అని కామెంట్ చేస్తూ మెటా అనే క్యాప్షన్ ఇచ్చాడు.