యూట్యూబ్ వీడియోస్, షణ్ముఖ్ తో డాన్స్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయినటువంటి యూట్యూబ్ వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya ) ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అదేవిధంగా వెండితెరపై పలువురు హీరోలకు చెల్లెలు పాత్రలో నటించినటువంటి ఈమె తాజాగా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
సాయి రాజేష్ ( Sai Rajesh ) దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ ( Anand Devarakonda ) హీరోగా నటించిన బేబీ( Baby ) సినిమాలో హీరోయిన్గా నటించారు.ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమాలో వైష్ణవి చైతన్య కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో నటించినప్పటికీ ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వైష్ణవి చైతన్య ఆదివారం లాల్ ధర్వజా సింహవాహిని అమ్మవారి కోసం బంగారు బొనమెత్తింది.సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా వైష్ణవి చైతన్య బంగారు బొనమెత్తింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.
తాను ప్రతి ఏడాది బోనం పెడతానని తెలిపారు.అయితే ఎప్పుడు వచ్చినా తను క్యూలో నిలబడి అమ్మవారికి బోనం సమర్పించుకొనేదాన్ని ఈసారి మాత్రం బంగారు బోనంతో స్పెషల్ ఎంట్రీతో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.ఇక ఆలయ కమిటీ సభ్యులు ఈమెకు ప్రత్యేకంగా శాలువా కప్పి సత్కరించారు.ఇక బేబీ సినిమా విడుదలకు ముందు కూడా వైష్ణవి చైతన్య సినిమా మంచి సక్సెస్ సాధించాలని బోనం పెట్టిన విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇలా ఈమె బంగారపు బోనం మొక్కు చెల్లించుకున్నారని తెలుస్తోంది.