అమ్మ పాలకు విలువ కట్టడం అసాధ్యం.వాటితోనే బిడ్డ ప్రాణం నిలుస్తుంది.
బతికి బట్టకడుతుంది.కానీ.
అమృతంలాంటి ఆ పాలే ఓ బిడ్డకు విషమయ్యాయి.విషంగా మారిన తల్లి రొమ్ముపాలు తాగి.
ఓ బిడ్డ రక్తం కక్కుకొని చనిపోయాడు.ఈ ఘటన న్యూయార్క్ లో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళ్తే.
పెన్సిల్వేనియాకు చెందిన సమంతా విట్నీ జోన్స్ 11 వారాల తనయుడు ఏప్రిల్ 2 తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుక్కపెట్టి ఏడుస్తున్నాడు.
బిడ్డకు ఆకలేస్తోందేమోనని అందరి తల్లుల్లాగే ఆమె కూడా చనుబాలు పట్టించింది.తర్వాత ఆమె నిద్రలోకి జారుకుంది.ఉదయం గంటలప్పుడు ఆ చిన్నారి ఏడుస్తూ ఉండటంతో భర్త వచ్చి ఉయ్యాలలో వేశాడు.తర్వాత జోన్స్ లేచి చూసేసరికి బాలుడి నోటి నుంచి నురగ, రక్తం వస్తూ ఉలుకూ పలుకూ లేదు.
దీంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.కానీ అప్పటికే బిడ్డ చనిపోయాడని వైద్యులు తెలిపారు.

చనిపోయిన బిడ్డకు శవపరీక్ష నిర్వహించగా.పిల్లాడి రక్తంలో నొప్పులు తగ్గడానికి వాడే మెథడోన్; చిత్త వైకల్యానికి వాడే యాంఫిటామైన్, మెథాఫెటమైన్ ఔషధ మూలాలు కనిపించాయి.సమంత వేసుకున్న కొన్ని మందుల కారణంగానే తల్లిపాలు విషమంగా మారినట్లు వైద్యులు ధ్రువీకరించారు.కాగా.ఒకవైపు బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న తల్లిపై పోలీసులు కేసు పెట్టడం గమనార్హం.అయితే ఈ కేసులో విట్నీ జోన్స్కు యావజ్జీవిత శిక్ష పడవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇందులో ఆ తల్లి చేసిన తప్పు ఏమిటి .ఆకలిగా వున్నా బిడ్డ పిల్లాడికి పాలు ఇవ్వడం ఆ తల్లి చేసిన పాపమా .







