ప్రజలను మోసం చేసిన కేసీఆర్.. బాబుమోహన్ సంచలన కామెంట్స్.. ?

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో అమరులైన సంగతి ఎన్నటికి మరచిపోలేము.అలాగే తెలంగాణ వస్తే బ్రతుకులు బాగుపడతాయని కలలు కన్నారు యువత.

కానీ వారి కలలు కళ్లలోనే మిగిలిపోయాయి.ఆశలన్ని ఆవిరైపోయాయి.

Babu Mohan Sensational Comments On KCR, Telangana, Babu Mohan, Sensational Comme

దున్నపోతుల నుండి తప్పించుకున్న కుందేలు తోడేళ్లకు చిక్కినట్లుగా ఈ రాష్ట్ర పరిస్దితులు మారిపోతున్నాయనే వేదన పడుతున్నారట.ఇక ప్రస్తుతం బంగారు తెలంగాణ వస్తదని ఆశించిన కళ్లకు బాధల తెలంగాణ కనబడుతుండటంతో ఉద్యమకారుల కుటుంబాలు వేదనకు గురవుతున్నాయట.

కానీ ఈ విషయంలో పెదవి విప్పేవారే కరువయ్యారు.ఇదిలా ఉండగా తాజాగా కేసీఆర్ పై మాజీ మంత్రి బాబుమోహన్ సంచలన కామెంట్స్ చేశారు.

Advertisement

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ ఇంకా జనాన్ని మోసం చేస్తూ పదవులు అనుభవిస్తున్నాడని విమర్శించారు.ఇక రాష్ట్ర ఆర్ధికపరిస్దితి గత ప్రభుత్వాల్లో ఇంతలా దిగజార లేదని, ఏ సీఎం కూడా ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టలేదని, ఒక్క కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రమే ఈ క్రెడిట్ దక్కించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

ఏది ఏమైనా పదవి లేకుంటే ప్రాణాలు పోయినంతలా భావించే ఈ సీఏం ప్రజలకు చేసింది ఏం లేదు అప్పుల కుప్పలు నెత్తిన పెట్టడం తప్ప అంటూ వ్యాఖ్యానించారట.

Advertisement

తాజా వార్తలు