తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు( Congress MP candidates ) ఇవాళ సాయంత్రం బీ-ఫామ్లు ఇవ్వనున్నారు.ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో అభ్యర్థులకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ( Deepadas Munshi ) అందించనున్నారు.
ఈ క్రమంలో 14 మందికి తెలంగాణ పీసీసీ బీ-ఫామ్లు అందించనుందని తెలుస్తోంది.రేపు మరో ముగ్గురు ఎంపీ అభ్యర్థులకు దీపాదాస్ మున్షీ బీ-ఫామ్లు( B-Forms ) అందించనున్నారు.
కాగా పెండింగ్ లో ఉన్న మూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఏఐసీసీ సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది.
ఈ నేపథ్యంలో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రామసహాయం రఘురామిరెడ్డికి, కరీంనగర్ ఎంపీ టికెట్ వెలిచాల రాజేందర్ రావుకు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా హైదరాబాద్ ఎంపీ టికెట్ ను సమీర్ ఉల్లాకు పార్టీ అధిష్టానం కేటాయించిందని సమాచారం.సాయంత్రం అధికారిక ప్రకటన రానుండగా.ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్థులుగా రఘురామి రెడ్డి, రాజేందర్ రావులు నామినేషన్లు దాఖలు చేశారు.ఇక హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సమీర్ ఉల్లా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారని సమాచారం.







