టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ లీల( Sree Leela ) పేరు ఓ రేంజ్ లో మారుమోగిపోయింది.ఈమె నటించిన ధమాకా సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు డజనుకు పైగా సినిమా అవకాశాలు వచ్చాయి.
అయితే కథ ప్రాధాన్యత విషయం పక్కన పెట్టి వచ్చిన అవకాశాలు అన్నింటిని అందుకుంటూ ఓ వెలుగు వెలిగినటువంటి ఈమెకు ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందించలేక పోయిందని చెప్పాలి.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరు హీరోలతో కలిసిన నటించిన శ్రీ లీలకు ప్రతిసారి చేదు అనుభవమే ఎదురయింది.
![Telugu Kollywood, Sreeleela, Sreeleelagreen, Vijay-Movie Telugu Kollywood, Sreeleela, Sreeleelagreen, Vijay-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Sreeleela-green-signals-to-special-songsb.jpg)
ఇలా ఈమె నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ కావడంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.ప్రస్తుతం శ్రీ లీల చేతిలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustad Bhagath Singh ) సినిమా మాత్రమే ఉంది ఇతర ఏ సినిమాలకు కూడా ఈమె కమిట్ అవ్వలేదు.అయితే శ్రీ లీలకు తెలుగులో అవకాశాలు లేకపోయినా తమిళంలో అవకాశాలు వస్తున్నాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈమెకు తమిళంలో స్టార్ హీరోలు అయినటువంటి అజిత్, విజయ్ సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయంటూ వార్తలు వచ్చాయి.
![Telugu Kollywood, Sreeleela, Sreeleelagreen, Vijay-Movie Telugu Kollywood, Sreeleela, Sreeleelagreen, Vijay-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Sreeleela-green-signals-to-special-songsc.jpg)
ప్రస్తుతం హీరో విజయ్ గోట్( Goat ) (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంలో నటిస్తున్నారు.ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేస్తుందట.ఇందులో ఓ ఐటెమ్ సాంగ్ కోసం ఏమైనా సంప్రదించారని తెలుస్తోంది.మరి ఇలా స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సింది మరోవైపు బుచ్చిబాబు డైరెక్షన్లో రాంచరణ్ నటిస్తున్నటువంటి సినిమాలో కూడా ఈమెకు సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా ఏ విధమైనటువంటి ప్రకటన వెలబడలేదని చెప్పాలి.
మొత్తానికి వరుస ఫ్లాప్ సినిమాలు తనని వెంటాడటంతో ఏకంగా స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా శ్రీ లీల సిద్ధమయ్యారని తెలుస్తుంది.