వాట్సప్‌లో అద్భుత ఫీచర్.. ఫైల్ షేరింగ్ లిమిట్‌ పెంపు వారికి కూడా..

వాట్సప్.ప్రస్తుతం ట్రెండ్‌లో నడుస్తున్న ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ ఇది.

ప్రస్తుత కాలంలో వాట్సప్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరీ మొబైల్ లో వాట్సప్ లేకుండా ఉండటం లేదు.

ఫొటోలను, డాక్యుమెంట్లను ఇతరులతో పంచుకోవడంతో పాటు ఛాటింగ్ చేసుకోవడానికి వాట్సప్ చాలా ఉపయోగపడుతుంది.ఇక ఏదైనా బిజినెస్ చేసేవారికి తమ కస్టమర్లతో కనెక్ట్ అవ్వడానికి వాట్సప్ బాగా ఉపయోగపడుతుంది.

ఇక వాట్సప్ యాజమాన్యం కొత్తగా పేమెంట్స్ సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చింది.ఈ పేమెంట్స్ సర్వీసుల ద్వారా వేరేవారికి డబ్బులు కూడా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.వారి నెంబర్ ను సెలక్ట్ చేసుకుని డబ్బులు పంపిస్తే నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి.

ఈ ఆప్షన్ ద్వారా సులువుగా ఇతరులకు డబ్బులు పంపవచ్చు.అయితే యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది.

Advertisement

ఇటీవల ఫైల్ షేరింగ్ లిమిట్ ను 2జీబీకి పెంచింది.దీని ద్వారా 2జీబీ ఫైల్ ను కూడా ఇతరులకు పంపవచ్చు.

గతంలో కొంతమందికి మాత్రమే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాగా.త్వరలో వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

అంతకుముందు కేవలం 100 ఎంబీ సైజ్ ఉన్న ఫైల్స్ ను మాత్రమే ఇతరులకు పంపడానికి వాట్సప్ లో వీలు ఉండేది.వినియోగదారుల సౌలభ్యం మేరకు 2జీబీ ఫైల్స్ ను కూడా సెండ్ చేసుకునేలా కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.

త్వరలో ఫిల్టర్, డబుల్ వెరిఫికేషన్, గ్రూప్ వెరిఫికేషన్ లాంటి ఫీచర్లను తెచ్చేందుకు వాట్సప్ ప్రయత్నాలు చేస్తోంది.ఫిల్టర్ ఆప్షన్ ద్వారా కాంటాక్ట్స్, నాన్-కాంటాక్ట్స్‌, రీడ్ మెసేజ్‌లు, అన్‌రీడ్ మెసేజ్‌లను యూజర్లు చెక్ చేసుకోవచ్చని వాట్సప్ ప్రతినిధులు చెబుతున్నారు.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ఇండియాలోనే అతిపెద్ద ట్రక్కు.. దీనికి ఎన్ని చక్రాలు ఉన్నాయో తెలిస్తే..

త్వరలోనే ఈ ఫీచర్లు వినియోగదారుల ముందుకు వస్తాయని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు