తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు డబ్బింగ్ సీరియల్ చిన్నారి పెళ్లి కూతురు తో పరిచయం అయిన అవికా గౌర్ ఆ తర్వాత టాలీవుడ్ లో ఉయ్యాల జంపాల సినిమా తో హీరోయన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత ఆమెకు వచ్చిన ఆఫర్లు సక్సెస్ అవ్వలేదు.
దాంతో కొద్ది కాలానికే ఆమె ఫేడ్ ఔట్ అయ్యింది.అదే సమయంలో ఆమె కాస్త లావు పెరగడం వల్ల కూడా ఏడాది పాటు బ్రేక్ తీసుకుని సినిమా ల్లో రీ ఎంట్రీ ఇచ్చింది.
రీ ఎంట్రీ లో ఓంకార్ ఈమెకు ఆఫర్ ఇచ్చాడు.ఆ సినిమా కూడా నిరాశ పర్చింది.
అయినా కూడా నిరాశ పడకుండా వరుసగా సినిమాలతో ప్రయత్నాలు చేస్తూనే ఉంది.తాజాగా ఈమెకు మెగా హీరో కళ్యాణ్ దేవ్ హీరోగా శ్రీధర్ శ్రీపాన దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది.
ఆ సినిమా లో కళ్యాణ్ దేవ్ కు జోడీగా అవికా గౌర్ రొమాన్స్ చక్కగా వస్తుందని ఇటీవలే యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.తాజాగా మరోసారి చిత్ర యూనిట్ సభ్యులు అవికా గౌర్ కు సంబంధించిన పిక్స్ ను షేర్ చేశారు.
దాంతో పాటు సినిమా లోని ఆమె గ్లింప్స్ ను కూడా ఆమె పుట్టిన రోజు సందర్బంగా రివీల్ చేశారు.
ఈ వీడియోలో అవికా చాలా సన్నబడ్డట్లుగా కనిపిస్తుంది.అలాగే ఆమె ఈ సినిమా లో అందాల ప్రదర్శణ విషయంలో ఏమాత్రం తగ్గలేదు అని కూడా అనిపిస్తుంది.మొత్తానికి అవికా గౌర్ కు ఈ సినిమా తో ఖచ్చితంగా ఒక మంచి విజయం అయితే రావచ్చు అంటున్నారు.
చిన్నారి పెళ్లి కూతురు తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొత్త ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన అవికా బరువు తగ్గిన తర్వాత మళ్లీ రీ ఎంట్రీతో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.