సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీల గురించి లేదంటే ఇతర రంగాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారి బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు సర్వసాధారణం.ఇలా ఎన్నో బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇక సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత సీనియర్ నటి సావిత్రి ( Savitri ) ఒకరు.ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న సావిత్రి బయోపిక్ చిత్రంగా మహానటి ( Mahanati ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఈ మహానటి సినిమాలో కీర్తి సురేష్ ( Keerthy Suresh )సావిత్రి పాత్రలో నటించారు.ఈమె ఈ పాత్రలో ఒదిగిపోయి నటించారనే చెప్పాలి.సావిత్రి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచినందుకుగాను కీర్తి సురేష్ కు ఏకంగా ఉత్తమ జాతీయ నటి అవార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇకపోతే తాజాగా నటుడు అవసరాల శ్రీనివాస్( Avasarala Srinivas ) మహానటి సినిమా గురించి ఇటీవల చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాలో తాను ఎల్బీ శ్రీరామ్ పాత్రలో నటించాలని తెలిపారు.
అశ్విన్ అడగడంతో కాదనలేక వెంటనే ఈ పాత్రలో నటించానని చెప్పారు.అయితే సావిత్రి గారి పాత్రలో ఎవరు నటిస్తున్నారని అడగగా కీర్తి సురేష్ పేరు చెప్పారు.కీర్తి పేరు చెప్పగానే తాను ఈ సినిమాకు రాంగ్ ఛాయిస్ అని అనుకున్నాను.
కీర్తి సురేష్ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేస్తారు.ఆమె ఇలా సావిత్రి గారి పాత్రలో నటించగలరా ఆమెలా హావభావాలు పలికించగలరా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఇక ఈ సినిమా నుంచి కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో నేను తప్పుగా ఆలోచించాలని కీర్తి సురేష్ సావిత్రి గారి పాత్రకు ఫర్ ఫెక్ట్ ఛాయిస్ అని అప్పుడు అర్థమైంది అంటూ ఇటీవల ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.