ఏడాది లోపు 100 బుక్స్ రాసిన రచయిత... ఎలాగో తెలుసా?

ఏంటి, ఏడాది లోపు ఒక్క పుస్తకం రాయడమే కష్టం… అలాంటిది 100 పుస్తకాలు( 100 Books ) రాయడమే? మేము నమ్మం అని అనుకుంటున్నారా? నమ్మాల్సిందే అండీ.ఎందుకంటే ఇది నిజం కనుక.

 Author Uses Ai Generators Including Chatgpt To Write Nearly 100 Books In Less Th-TeluguStop.com

మరి అదెలా సాధ్య పడిందో తెలుసుకోవాలంటే మీరు ఈ కధనం పూర్తిగా చదవాల్సిందే.పుస్తకం రాయాలనే కోరిక చాలామందికి ఉంటుంది.

కానీ వేళల్లో ఒక్కరికే ఆ అభిరుచి, టాలెంట్ ఉంటాయి.ఒకవేళ టాలెంట్ ఉన్నప్పటికీ ఏడాది లోపు 100 బుక్స్ రాయడమంటే మాటలు కాదు.

కానీ అతగాడికి సాధ్యపడింది.

ఎలాఅంటే… ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ( ChatGPT ) కారణంగా అతగాడు ఆ ఫీట్ సాధించాడు.దాని సహాయంతో అతగాడు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఓ రచయిత చాట్‌జీపీటీ వాడుతూ ఏడాది లోపే ఏకంగా 100 పుస్తకాలను రాసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.ఇన్ని పుస్తకాలు రాయడంతో పాటు ఈ క్రమంలో మంచి రాబడిని కూడా ఆర్జించాడు మరి.ఈ క్రమంలో చాట్‌జీపీటీ, క్లాడ్ వంటి ఏఐ టూల్స్ సాయంతో “టిమ్ బౌచర్” ఏకంగా 100 ఎగ్జైటింగ్ ఈ బుక్స్‌ను తీసుకువచ్చాడని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.

ఈ బుక్స్‌ను బౌచర్ ఏఐ లోర్ సిరీస్‌గా పిలుస్తాడు.మానవ సృజనాత్మకతకు ఈ ఏఐ టూల్స్ పదును పెడతాయని బౌచర్ చాలా బలంగా నమ్ముతున్నాడు.ఏఐ సామర్ధ్యాల గురించి చెబుతూ తన స్టోరీలను ప్రజల ముందుంచే క్రమంలో ఏఐ చాట్‌బాట్స్‌, ఇమేజ్ జనరేటర్స్‌ను వాడినట్టు చెప్పుకొచ్చాడు.

ఏఐ చాట్‌బాట్స్ సాయంతో బౌచర్ మంచి మంచి ఆలోచనలతో టెక్ట్స్‌ను రూపొందిచడంతో పాటు అందమైన ఇలస్ట్రేషన్స్‌ కూడా రూపొందించాడు మరి.బౌచర్ బుక్స్ 5000 పదాలతో పాటు కొన్ని డజన్ల ఏఐ జనరేటెడ్ ఇమేజెస్‌తో కస్టమర్ల ముందుకొచ్చాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube