Australian Indian talent : భారతీయుల కోసం భారీ పెట్టుబడులకు సిద్ధమైన ఆస్ట్రేలియా...!!

కోవిడ్ మహమ్మారి తర్వాత విదేశీయులపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాతి నుంచి కరోనాకు ముందు వున్న పరిస్ధితులను కల్పించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.దీనిలో భాగంగా వలసదారులకు, పర్యాటకులకు గమ్యస్థానంగా మారడానికి ప్రణాళికలను రూపొందిస్తోంది.

 Australian Govt Ready To Invest $3.5m For Indian Talent , Australian Govt , Aust-TeluguStop.com

ఇటీవల ఆస్ట్రేలియన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్, తెలంగాణ ప్రభుత్వం మధ్య సైబర్‌టెక్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూయర్స్ప్రోగ్రామ్ కోసం ఒప్పందం కుదిరింది.ఇది ఇరు దేశాలలో వున్న మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనకరంగా వుంటుందని నిపుణులు అంటున్నారు.

మరోవైపు.భారతదేశానికి చెందిన విద్యార్ధులు, వృత్తి నిపుణులను ఆకర్షించేందుకు గాను సిడ్నీలోని హారిస్ పార్క్‌లో లిటిల్ ఇండియా బిజినెస్ పార్క్ అభివృద్ధికి ఆస్ట్రేలియా ప్రభుత్వం 3.5 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల గ్రాంట్‌ను ప్రకటించింది.ముందుగా అనుకున్న ప్రణాళికల ప్రకారం ఈ ప్రాంతంలో ‘ఇండియా గేట్ ’’ నిర్మాణం కూడా పునర్నిర్మించనున్నారు.

ఇది భారతీయ సంస్కృతిని సూచిస్తుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

Telugu Australia, Australia Pm, Australian, Harris Park, India, Ready Invest, Sa

లిటిల్ ఇండియా హారిస్ పార్క్ బిజినెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ దేశ్వాల్ మాట్లాడుతూ.లిటిల్ ఇండియా కల సాకారం కావడానికి చాలా ఏళ్లు పట్టిందన్నారు.ఇక్కడి భారతీయ సమాజానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి బలమైన మద్ధతు లభించడం పట్ల గర్వంగా వుందన్నారు.

భారతీయ విద్యార్ధులు, నైపుణ్యం కలిగిన వారికి ఆస్ట్రేలియా అవకాశాల గని అని సంజయ్ పేర్కొన్నారు.లిటిల్ ఇండియా అభివృద్ధికి ఆస్ట్రేలియా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, మౌలిక సదుపాయాలు, భద్రత ఏర్పాట్లు బాగున్నాయన్నారు.మరోవైపు… భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం తెలిపింది.ఈ మేరకు ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ ప్రకటన చేశారు.

ఈ ఒప్పందంపై ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరుదేశాలు సంతకాలు చేశాయి.మరో 30 రోజుల్లో ఈ ఒప్పందం అమల్లోకి రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube