ఆ మూడు నగరాలకి వలసల తాకిడి: రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

దేశంలోని ప్రధాన నగరాలలోకి ఉపాధి, విద్య తదితర అవసరాల నిమిత్తం పెద్దఎత్తున వలసలు జోరందుకుని జనాభా విపరీతంగా పెరిగిపోతుండటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం దృష్టిసారించింది.

ఈ క్రమంలో నగరాలపై ఒత్తిడి తగ్గించేందుకు గాను ఇతర నగరాల్లో స్థిరపడేందుకు సిద్ధంగా ఉన్న నైపుణ్యం కలిగిన వారికి వీసాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాల్లో జనాభా ఇతర ప్రాంతాల కంటే రెండు రెట్లు వేగంగా పెరుగుతోంది.ఈ క్రమంలో తన ప్రాంతీయ వలస కార్యక్రమం కింద వీసాల సంఖ్యలను 23 వేల నుంచి 25 వేలకు పెంచుతున్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ కార్యాలయం శనివారం ఒఖ ప్రకటనలో తెలిపింది.

మోరిసన్ ప్రభుత్వం గత జూలై 1 నాటికి వార్షిక ఇమ్మిగ్రేషన్‌ను 1,60,000కు తగ్గించింది.అంతకు ముందు ఇది 1,90,000గా ఉండేది.

వార్షిక ఇమ్మిగ్రేషన్ స్కేలు కింద చిన్న నగరాలతో పాటు ఇష్టమైన ప్రాంతాల్లో నివసించడానికి ఇష్టపడేవారికి 25,000 వీసాలను ప్రభుత్వం కేటాయించింది.

Advertisement

  ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాలో నివసిస్తున్న జనాభాలో దాదాపు మూడవ వంతు మంది ఇతర దేశీయులే.సదరు సంస్థ లెక్కల ప్రకారం.2017-18 మధ్య ఆయా నగరాల్లో నివసించే వారి సంఖ్య.మిగిలిన దేశ భూభాగంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగిందట.

ఆస్ట్రేలియా మొత్తం జనాభా పెరుగుదలలో రాజధాని నగర వృద్ధి 79 శాతంగా వుంది.మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్ నగరాలకు వెలుపల నివసించడానికి ఇష్టపడే వలసదారులకు.

ఆస్ట్రేలియాలో పోస్ట్-స్టడీ వర్క్ వీసాపై దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రభుత్వం ప్రకటించింది.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు