ఆసీస్ బౌలర్లకు ఉతికారేసిన ఆఫ్ఘన్ బ్యాటర్లు..ఆసీస్ ముందు 292 పరుగుల టార్గెట్..!

ముంబైలోని వాఖండ్ వేదికగా ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్(Afghanistan ) మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది.

టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్( Afghanistan ) జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.

ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఆఫ్గాన్ బ్యాటర్లు ఎదుర్కొన్నారు.ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్( Ibrahim Zadran ) 129 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి ప్రపంచ కప్ లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు.

ఇబ్రహీం జద్రాన్ లో సెంచరీ చేసిన తొలి ఆప్ఘనిస్తాన్ బ్యాట్స్ మెన్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు.ఇబ్రహీం జద్రాన్ తన కెరియర్ లో ఇది నాలుగవ సెంచరీ.

చివర్లో వచ్చిన రషీద్ ఖాన్ 18 బంతుల్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్ లతో 35 పరుగులు చేయడంతో 291 పరుగులు నమోదయ్యాయి.

Advertisement

ఆస్ట్రేలియా జట్టు బౌలర్ల విషయానికి వస్తే.జోష్ హేజిల్ వుడ్( Hazlewood ) రెండు వికెట్లు, మిచెల్ స్టార్క్ ఒక వికెట్, ఆడమ్ జంపా ఒక వికెట్, గ్లెన్ మాక్స్ వెల్ ఒక వికెట్ తీశారు.cఆస్ట్రేలియా జట్టు 292 పరుగుల లక్ష్యాన్ని చేదించి ఆఫ్ఘనిస్తాన్ పై గెలిస్తే మరో మ్యాచ్ ఆడాల్సి ఉండగానే సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది.

ఒకవేళ ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోతే తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్ పై ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు విషయానికి వస్తే.ఈ మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేసి గెలిస్తే సెమీఫైనల్ చేరే అవకాశాలు మెరుగు అవుతాయి.ఈ టోర్నీలో పసికూన జట్టుగా అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో ఏకంగా నాలుగు మ్యాచ్లలో గెలిచి ఎనిమిది పాయింట్లతో ఆరవ స్థానంలో ఉంది.

ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే.ఆఫ్ఘనిస్తాన్ తన తదుపరి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా పై గెలవడంతోపాటు మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం కాబట్టి రెండు జట్లు కూడా గెలుపు కోసం గట్టిగానే పోటీ పడుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021
Advertisement

తాజా వార్తలు