డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి 11’గంటలు దాటాక .మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు….
టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి( Bandaru Satyanarayana Murthy )ని అరెస్టు చేసేందుకు ప్రయత్నం….బండారు ఇంటికి భారీగా చేరుకున్న పోలీసు బలగాలు….
ఎక్కడికక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేసిన పోలీసులు.
బండారు సత్యనారాయణ మూర్తికి 41 ఏ నోటీసులు ఇచ్చి స్టేషన్ కి తీసుకెళ్లేందుకు ప్రయత్నం….
బండారు అరెస్టు చేస్తారన్నవిషయం తెలుసుకున్న టిడిపి శ్రేణులు….భారీగా తరలివచ్చిన టిడిపి శ్రేణులు( TDP ) కార్యకర్తలు.
స్థానిక సినిమా హాల్ జంక్షన్ సబ్ స్టేషన్ దగ్గర ప్రహర గేట్లు ఏర్పాటు….ఎక్కడికక్కడ స్థానిక నాయకులను కార్యకర్తలను బండారు ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు….
ఇటీవల కాలంలో బండారు సత్యనారాయణమూర్తి వైకాపా మహిళా మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే….దీనిపై వైకాపా మహిళా కమిషన్ సభ్యురాలు వాసిరెడ్డి పద్మ డిజిపికి రెండు రోజుల కిందట లేఖ రాసిన వాసిరెడ్డి పద్మ( Vasireddy Padma ).ఒక మహిళా మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బండారును అరెస్టు చేయాలని లేఖలో పేర్కొన్న వాసిరెడ్డి పద్మ….అర్ధరాత్రి 11 గంటలు దాటాక బండారు ఇంటి వద్ద హై డ్రామా….