పశ్చిమ గోదావరి: జిల్లాలో దారుణం జరిగింది.బీమవరంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఓ వ్యక్తి గాయపరిచాడు.
ర్యాష్ డ్రైవింగ్‌తో తప్పు చేయడమే కాకుండా అడ్డుకున్న పోలీసుపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.సంతోష్ అనే వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్‌తో కారులో వేగంగా వెళుతూ ఇద్దరిని గాయపరిచాడు.
దీంతో అతివేగంగా వెళుతున్న కారును అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు.తన కారునే ఆపుతావా?.అంటూ సంతోష్ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు.ఈ ఘటనలో పోలీస్‌కు గాయాలయ్యాయి.కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.పూర్తి సమాచారం అందవలసి ఉంది.







