అమెరికాలో ‘‘5జీ’’ సేవలు షురూ.. కండీషన్స్ అప్లై, విమానాలకు డోంట్ వర్రీ..!

అమెరికాలో 5జీ సేవల వ్యవహారం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎయిర్‌పోర్ట్ రన్‌వేల వద్ద 5జీ టవర్స్ వుండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని.

 At&t Begins 5g C-band Rollout In Limited Number Of Metro Areas, At&t, Verizon, 5-TeluguStop.com

అందువల్ల అక్కడ వాటిని తీసేయాలని ఎయిర్‌లైన్స్ సంస్థలు వైట్‌హౌస్‌కు లేఖ రాశాయి.అంతేకాదు.

అమెరికాకు పలుదేశాల ఎయిర్‌లైన్స్ సంస్థలు సర్వీసులను నిలిపివేశాయి.అయితే అక్కడ మళ్లీ 5జీ సేవలు ప్రారంభమయ్యాయి.

టెలికాం సంస్థలు ఏటీ అండ్‌ టీ, వెరైజన్‌‌లు 5జీ సేవలను ప్రారంభించినట్లుగా ప్రకటించాయి.ప్రస్తుత వివాదం నేపథ్యంలో విమానాలకు అంతరాయం లేకుండా ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది.3.7- 3.98 గిగాహెర్ట్జ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్‌, ఏటీ అండ్‌ టీ రూ.లక్షల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను పొందాయి.ముందుగా అనుకున్న దాని ప్రకారం.అమెరికాలో 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల సాధ్యపడలేదు.

అమెరికా నుంచి రాకపోకలు సాగించాల్సిన మొత్తం 538 విమానాలు 5జీ సేవలు ప్రారంభమవడం కారణంగా రద్దు కానున్నాయని వార్తలు హల్‌చల్ చేశాయి.అయితే బుధవారం కేవలం 215 విమానాలు మాత్రమే రద్దయ్యాయి.

వీటిలో ఎమిరేట్స్, ఎయిరిండియా, ఏఎన్‌ఏ, జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సర్వీసులు వున్నాయి.అయితే యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) నుంచి హామీ రావడంతో పలు ఎయిర్‌లైన్ సంస్థలు గురువారం నుంచి మళ్లీ తమ సేవలు పునరుద్ధరించినట్లు సమాచారం.

Telugu Band Networks, Federal, Verizon, White-Telugu NRI

కాగా.5జీ సేవ‌ల‌ను ఎయిర్‌పోర్టుల వ‌ద్ద వినియోగించ‌వ‌ద్దని అమెరికాకు చెందిన ప్ర‌ముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ‌లు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.విమానాశ్రయాల వ‌ద్ద 5జీని వాడటం వల్ల.విమాన ప్ర‌యాణ‌, ర‌వాణా వ్య‌వ‌స్థ‌కు ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని ఆ సంస్థల సీఈవోలు తెలిపారు.ఈ నేప‌థ్యంలోనే వైట్‌హౌస్‌కు లేఖ రాశారు.ర‌న్‌వేల‌కు 2 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు 5జీ వ‌ద్దు అని ఆ లేఖ‌లో వాళ్లు కోరారు.లేఖ రాసిన వారిలో యూపీఎస్ ఎయిర్‌లైన్స్‌, అల‌స్కా ఎయిర్‌, అట్లాస్ ఎయిర్‌, జెట్‌బ్లూ ఎయిర్‌వేస్‌, ఫెడ్ఎక్స్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి.

5జీ ఏర్పాటు కోసం ఏటీ అండ్ టీతో పాటు వెరిజాన్ సంస్థ‌ల‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.దేశంలో సుమారు 48 విమానాశ్ర‌యాల వ‌ద్ద ట్రాన్స్‌పాండ‌ర్ల ఏర్పాటుకు ఫెడ‌ర‌ల్ ఏవియేష‌న్ అడ్మినిస్ట్రేష‌న్ ఆమోదం తెలిపింది.వాస్త‌వానికి జ‌న‌వ‌రి 19వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా 5జీ అందుబాటులోకి రావాల్సి ఉంది.

అయితే ఎయిర్‌లైన్స్‌ సంస్థల ఆందోళ‌న‌ల‌తో 5జీ అమ‌లు మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube