పంజాబ్ లో ఘోరం.. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన ఎన్నారై అల్లుడు.. అత్తారింట్లో చేసిన..

Atrocity In Punjab Son-in-law Of NRI Returned From Dubai , Dubai , Punjab Son-in-law , Mukstar , Panniwala, Gajjan Singh, Narinder Singh, Balwinder Singh, NRI

మనదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన ఎన్నారై అల్లుడు భార్యపై కోపంతో అత్తారింట్లో తీవ్రవిషధాన్ని నింపాడు.

 Atrocity In Punjab Son-in-law Of Nri Returned From Dubai , Dubai , Punjab Son-i-TeluguStop.com

తన మామ, బావమరిదిని అత్యంత దారుణంగా హత్య చేశాడు.ఈ ఘటనలో మరో ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటన జరిగిన తర్వాత ఆ నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.బాధితుల ఫిర్యాదు మేరకు ముక్‌స్తర్ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ముక్‌స్తర్ జిల్లా పన్నీవాలా అనే గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.నిందితుడు బల్విందర్ సింగ్ అదే రోజు ఉదయం దుబాయ్ నుంచి అత్తగారి ఊరు అయినా పన్నీవాలా వచ్చాడు.అత్తారింటికి వచ్చాక మామ గజ్జన్ సింగ్ బామ్మర్ది నరీందర్ సింగ్ తో గొడవపడ్డాడు.

వారి మధ్య మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్ళింది.ఈ క్రమంలో బల్వీందర్ సింగ్ తన చేతికి అందిన ఒక పదునైన వస్తువుతో గజ్జన్ సింగ్, నరీందర్ సింగ్ పై దాడి చేశాడు.

Telugu Balwinder Singh, Dhubai, Gajjan Singh, International, Muk, Narinder Singh

దాంతో వారు అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయారు.ఈ గొడవ లో అడ్డువచ్చిన రచ్‌పాల్ కౌర్, రవీందర్ సింగ్, గుర్పాల్ సింగ్‌ను కూడా బల్వీందర్ గాయపరిచి అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.అయితే గజ్జన్ సింగ్ కూతురు రమణదీప్ కౌర్‌కు రెండు సంవత్సరాల క్రితం అతనితో వివాహం అయింది.అయితే పెళ్లయిన నాలుగు నెలలకే అతడు దుబాయ్ కి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత తిరిగి అసలు రాలేదు.తన భర్త కట్నం కోసమే తనను విడిచిపెట్టి వెళ్లిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

పెళ్లయిన తర్వాత బల్వీందర్ సింగ్ ఈరోజు దుబాయ్ నుంచి తిరిగి వచ్చి తన కుటుంబం పై దాడి చేశాడని రమణదీప్ కన్నీరు మున్నీరుగా విలపించింది.ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేశామని మలౌట్ డీఎస్పీ బాల్కర్ సింగ్ వెల్లడించారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube