ఇటీవలే కాలంలో సహజంగా మరణించే వారి సంఖ్య కంటే దారుణమైన హత్యలకు గురై మరణిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువ.గతంలో ఎప్పుడో ఒకసారి ఎక్కడో చోట హత్య జరిగిన వార్తలు వినిపించేవి.
కానీ ప్రస్తుతం ప్రతిరోజు ఎన్నో దారుణమైన హత్యలు జరుగుతూ అందరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.ఒకపక్క ప్రపంచం అభివృద్ధి చెందుతూ ఉంటే మరొక పక్క మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాడు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
సంసారం అన్నాక ఎన్నో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి.కాస్త ఆలోచించి అడుగులు వేస్తే ఆ కుటుంబంలో సంతోషాలకు హద్దులు అనేవి ఉండవు.
అలాకాకుండా చిన్న చిన్న సమస్యలకు కూడా క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే చివరికి కుటుంబాలు నాశనం అవుతాయి.ఇలాంటి కోవలోనే ఓ భర్త క్షణికావేశంలో భార్యను హత్య చేసిన ఘటన బోయిన్ పల్లి( Boyne Palli ) పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.అమలాపురానికి( Amalapuram ) చెందిన సత్యనారాయణ ( Satyanarayana ) న్యూ బోయిన్ పల్లిలో ఓ అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.అయితే సత్యనారాయణకు అతని భార్య ఝాన్సీ లక్ష్మి కి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో ఝాన్సీ లక్ష్మి( Jhansi Lakshmi ) తన బంధువుల ఇంటికి వెళ్ళింది.అయితే సత్యనారాయణ, ఝాన్సీ లక్ష్మి ఉండే బంధువుల ఇంటికి వెళ్లి తాజాగా మరోసారి గొడవపడ్డాడు.
పద్యంలో తన భార్యపై కత్తితో దాడి చేశాడు.ఈ గొడవ ఆపడానికి మధ్యలో వచ్చిన మరో మహిళకు కూడా తీవ్రంగా గాయాలు కావడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఝాన్సీ లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది.పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న సత్యనారాయణ కోసం పోలీసులు నగరమంతా గాలింపు చర్యలు చేపట్టారు.







