Anasuya Bhardwaj : అనసూయ భర్తపై దారుణమైన ట్రోల్స్.. దెబ్బకు కౌంటర్లు ఇస్తున్న ఫ్యాన్స్?

అప్పుడప్పుడు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్రోల్స్ కు గురవుతూ ఉంటారు.వాళ్లలో ఏదైనా పొరపాటు కనిపిస్తే చాలు వెంటనే వారిని కూడా బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు.

 Atrocious Trolls On Anasuyas Husband Fans Giving Counters To The Blow-TeluguStop.com

అయితే తాజాగా యాంకర్ అనసూయ భర్త కూడా నెటిజన్స్ నుంచి దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు.ఇంతకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ బుల్లితెరపై యాంకర్ గా కొంతకాలం బాగా సందడి చేసిన అనసూయ ఇప్పుడు వెండితెరపై కూడా బాగా హడావుడి చేస్తుంది.చేతినిండా ప్రాజెక్టులతో బాగా బిజీగా మారింది.

ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఫ్యామిలీని, ఇంటిని చూసుకుంటూ కాస్త సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో కూడా సమయాన్ని గడిపేస్తుంది.

మొదట్లో న్యూస్ యాంకర్ గా చేసిన అనసూయ( Anasuya bhardwaj ) ఆ తర్వాత వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా అడుగు పెట్టింది.ఇక అదే సమయంలో బుల్లితెరపై యాంకర్ గా జబర్దస్త్ షోలో పరిచయం అయింది.దీంతో తలరాత మొత్తం మారిపోయింది.

సైడ్ ఆర్టిస్ట్ గా నటించిన అనసూయకు వెండితెరపై కీలక పాత్రలో అవకాశాలు వచ్చాయి.అలా బుల్లితెర, వెండితెర పై బాగా బిజీబిజీగా కనిపించింది.

అయితే ఆ మధ్యనే జబర్దస్త్ ( Jabardasth )కు దూరమై మరికొన్ని షో లలో కూడా చేయగా ఇక వెండితెరపై వరుస సినిమాలు రావటంతో బుల్లితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.ప్రస్తుతం తన ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయని చెప్పాలి.ఇక సినిమాలలో నెగటివ్ క్యారెక్టర్స్ తో కూడా బాగా అదరగొడుతుంది.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన భర్త, పిల్లల ఫోటోలను, తన ఫోటోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ ముద్దుగుమ్మకు ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ కూడా తన అందంలో ఎటువంటి మార్పు లేదు.కాస్త బుద్దుగా ఉన్నప్పటికీ కూడా చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అనసూయ.ఇక అనసూయ ను చాలామంది అదృష్టంగా భావిస్తూ షాప్ ఓపెనింగ్స్ కు కూడా ఆహ్వానిస్తున్నారు.ఈ ఏడాది వరుస షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొని బాగా సందడి చేసింది అనసూయ.

అయితే ఇదంతా పక్కన పెడితే తనకు ఖాళీ సమయం దొరకటంతో తన ఫ్యామిలీతో విదేశాలలో తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది.ఇక అక్కడ దిగిన ఫోటోలను పంచుకుంటూ బాగా సందడి చేస్తుంది.

అయితే నేడు తమ పెళ్ళి రోజు సందర్భంగా తన భర్తతో ఉన్న వీడియోలు షేర్ చేస్తూ కనిపించింది.ఇందులో తాము బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది.

అంతేకాకుండా పెళ్లిరోజు సందర్భంగా తన భర్త పై ఉన్న ప్రేమను పంచుకుంది.అయితే ఆ వీడియోలో తన భర్తకు ఒక పన్ను లేనట్లు కనిపించింది.

దీంతో నెటిజన్స్ ఈసారి ఆయనను టార్గెట్ చేశారు.ఇంత ఆస్తి ఉంది ఒక్క పన్ను పెట్టించుకోవచ్చు కదా అంటూ కామెంట్ చేశారు.

ఇక మరో నెటిజన్.బర్రెకి బంగారం దొరికినట్టు ఉంది అంటూ దారుణంగా ట్రోల్ చేశారు.

దీంతో అనసూయ ఫ్యాన్స్ వెంటనే వారిపై ఫైర్ అవుతూ కనిపించారు.వారి లైఫ్ వాళ్ళ ఇష్టం.

వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు.వాళ్లకు లేని బాధ మీకు ఎందుకు అంటూ తిరిగి కౌంటర్లు వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube