కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న డైరెక్టర్లలో అట్లీ( Atlee Kumar ) ఒకరు కాగా ఈ డైరెక్టర్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జవాన్( Jawan ) సినిమాతో అట్లీ మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.
అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.తన ప్రతి సినిమాలో కథ, కథనం కొత్తగా ఉండేలా అట్లీ జాగ్రత్తలు తీసుకుంటారు.
అయితే అట్లీకి ఎదురైన అవమానాలు అన్నీఇన్నీ కావు.ప్రస్తుతం అట్లీని దేశమంతా అభినందిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే సౌత్ ఇండియాలో అట్లీపై వచ్చిన స్థాయిలో మరే దర్శకునిపై ట్రోల్స్ రాలేదట.ఆ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేయడం వల్లే తనకు సక్సెస్ దక్కిందని అట్లీ చెబుతుండగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
రోబో సినిమా సమయంలో శంకర దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన అట్లీ రజనీకాంత్ కే స్టైల్ గా డైలాగ్స్ చెబుతూ ఎలా చేయాలో చూపించాడు.రజనీకాంత్ రోబోకి అట్లీ డూప్ గా కూడా పని చేశాడు.అసలు పేరు అరుణ్ కుమార్ కాగా తొలి షార్ట్ ఫిల్మ్ నుంచి తన పేరును అట్లీగా మార్చుకున్నాడు.ఆ షార్ట్ ఫిల్మ్ కు మంచి పేరు రావడం వల్ల అట్లీకి డైరెక్టర్ శంకర్ దగ్గర పని చేసే అవకాశం దక్కింది.
రాజారాణి సినిమాతో దర్శకునిగా అట్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన కృష్ణప్రియ( Krishna Priya )తో అట్లీ వివాహం జరిగింది.పెళ్లి ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత కాకిముక్కుకి దొండపండు అంటూ కామెంట్లు చేశారని అట్లీ అన్నారు.వెక్కిరింపులు కొనసాగుతున్నా అదే సమయంలో అట్లీ విజయాల పరంపర కొనసాగుతుంది.
అట్లీ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.