ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు తెరకెక్కుతున్నాయి.పక్క భాషలు అనే సంబంధం లేకుండా హీరోలు, డైరెక్టర్స్ అంతా కూడా కలిసి పని చేయడానికి సిద్ధం అయ్యారు.
ఒకరితో ఒకరు భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ఇండియన్ సినిమాగా మార్చేశారు.దీంతో ఒక్కో ఇండస్ట్రీ నుండి ఒక్కో కాంబో పుట్టుకు వస్తుంది.
ఈ కాంబోస్ పాన్ ఇండియన్ సినిమా దగ్గర మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి.
మరి ఇప్పుడు మరో నెక్స్ట్ లెవల్ కాంబో తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ మాస్ కాంబినేషన్ పై అప్పుడే ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.మరి ఆ కాంబో ఏంటి అంటే అల్లు అర్జున్, అట్లీ( Allu Arjun, Atlee ) కాంబో.
ఈ కాంబోలో మూవీ ఆల్మోస్ట్ సెట్ అయినట్టు తాజాగా తమిళ్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.అంతేకాదు అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడు అని కూడా టాక్.
అందుకే ఈ కాంబోను ”AAA”( AAA ) అని పిలుచు కుంటున్నారు.కాగా తాజాగా మరో బజ్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోతోంది అని దీని సారాంశం.ఆ సంస్థ ఏంటంటే ఇటీవలే జైలర్ వంటి సినిమాతో కోట్ల రూపాయల లాభాలను అందుకున్న జైలర్( Jailer ) అట్లీ, బన్నీ కాంబో మూవీ నిర్మించ బోతుంది అని టాక్.
మరి ఈ కాంబోపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
డైరెక్టర్ అట్లీ కూడా ఇటీవలే జవాన్ సినిమాతో( Jaawan ) బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఈ సినిమా హిట్ తర్వాతనే అల్లు అర్జున్ అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది.మరి ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రజెంట్ పుష్ప ది రూల్ సినిమాతో బిజీగా ఉన్నాడు.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది.