మెగా హీరోతో ఫైటింగ్ కి రెడీ అయిన తమిళ హీరో! వాల్మీకి షూటింగ్ స్టార్ట్!

డీజే సినిమా తర్వత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్మీకి.ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటి సారి యాంటీ షేడ్స్ వున్న విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

 Atharvaamurali Has Been Signed For Telugu Film With Varun Tej Combinations-TeluguStop.com

దీంతో ఈ సినిమాపైన టాలీవుడ్ లో మంచి ఆసక్తి నెలకొంది.ఇక తమిళ సూపర్ హిట్ మూవీ జిగార్తాండకి ఇది రీమేక్ వెర్షన్ గా వస్తుంది.

ఈ సినిమా రీసెంట్ గా ప్రారంభోత్సవం జరుపుకుంది.ఇదిలా వుంటే ఈ సినిమాలో ఇంకో హీరోకి అవకాశం వుండటంతో చాలా మంది కుర్ర హీరోలని జల్లెడ పట్టిన దర్శకుడు హరీష్ శంకర్ ఎట్టకేలకు హీరోని ఫైనల్ చేసాడు.

వాల్మీకి సినిమా కోసం హరీష్ శంకర్ తమిళ యంగ్ హీరోని రంగంలోకి దించాడు.బాల పరదేశి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న అధర్వ మురళీని ఫైనల్ చేసాడు.

ఇప్పటికే తమిళ యంగ్ హీరోలు వరుసగా తెలుగు సినిమాలలో ఆఫర్స్ కొట్టేస్తున్నారు.విజయ్ సేతుపతి ఇప్పటికే మెగాస్టార్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నాడు.ఇప్పుడు మరో తమిళ యంగ్ హీరో అథర్వ మురళీ కూడా మెగా ప్రిన్స్ తో తెలుగులో తెరంగేట్రం చేయడం విశేషం.తమిళంలో మంచి గుర్తింపు వున్నా ఈ హీరోకి మెగా ప్రిన్స్ సినిమా కచ్చితంగా మంచి లాంచింగ్ అని చెప్పాలి.

ఈ సినిమా షూటింగ్ ఈ రోజు మొదలైంది.వరుణ్ తేజ్ తో పాటు హీరో అథర్వ కూడా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.

మరి వరుణ్ కెరియర్ లో మరో డిఫరెంట్ సినిమాగా రాబోతున్న వాల్మీకి అతనికి ఎ రేంజ్ హిట్ ఇస్తుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube