ఆత్మకూరు బరిలో టీడీపీ ? పవన్ కు ఇబ్బందులే ?

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి .ఏపీ మంత్రిగా ఉన్న సమయంలోనే మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం తో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

 Atmakuru Assembly By Elections Pawan Kalyan Troubled Details, Atmakuru Assembly-TeluguStop.com

వైసీపీ తరఫున గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీలో ఉండబోతూ ఉండగా, బిజెపి తమ అభ్యర్థిని ఈ ఎన్నికల్లో పోటీకి దింపుతామని ఇప్పటికే ప్రకటించింది.దీంతో ఇక్కడ ఉప ఎన్నిక ఏకగ్రీవం కాదు అనే విషయం పై స్పష్టత వచ్చింది.

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే విషయంలో స్పష్టమైన క్లారిటీ లేదు.అయితే ఈ రోజు టిడిపి నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో వైసిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కుమార్తె కైవల్య రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

అనేక రాజకీయా అంశాలపై ఛంర్చిన ఆమె ఆత్మకూరు ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా తాను బరిలోకి దిగేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆమె లోకేష్ ను కోరినట్లు సమాచారం.దీంతో టిడిపి అభ్యర్థిగా కౌవల్య రెడ్డి ని పోటీకి దింపే అవకాశం కనిపిస్తోంది.

అయితే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందా లేదా అనే విషయంలో ఇప్పటివరకు చంద్రబాబు ఏ నిర్ణయమూ తీసుకోలేదు.ఒకవేళ టిడిపి, బిజెపి అభ్యర్థులు ఇక్కడ పోటీకి దిగితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశం లేకపోలేదు.

ఎందుకంటే బీజేపీ తో జనసేన పొత్తు కొనసాగుతోంది.

Telugu Cm Jagan, Janasena, Kousalya Reddy, Mekapatigoutam, Lokesh, Pawan Kalyan,

కానీ వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ ను చీల్చడం తనకు ఇష్టం లేదు అని ప్రకటించిన పవన్ ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేఖ ఓటును చీలకుండా ఏ విధంగా అడ్డుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.ఏది ఏమైనా ఆత్మకూరు ఉప ఎన్నిక వ్యవహారం పవన్ కు ఇబ్బందికరంగా మారబోతోంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube