రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎవరు ఎన్ని తప్పుడు సర్వేలు రాయించుుకున్నా.కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఆదరణ ఉందన్నారు.
స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణ మొత్తం పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు.తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తయిన ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని విమర్శించారు.
ఎన్నికల సమయంలోనే కేసీఆర్ కు గొర్రెలు, బర్రెలు గుర్తొస్తాయి తెలిపారు.రూ.5లక్షల కోట్లు అప్పులు చేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి చేయకపోగా.రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆయన ఆరోపించారు.
రాహుల్ ,సోనియాతో నేరుగా మాట్లాడి.ప్రజాదరణ,పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్నవారికి.
సర్వేల ప్రకారం టికెట్లు ఇవ్వాలని కోరుతామని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్టు పనులు.
.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మా కార్యకర్తలను బెదిరిస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే భాస్కర్ రావు తన బంధువులైన పోలీస్ అధికారులను సీఐలుగా ,డిఎస్పీలుగా తెచ్చుకొని కాంగ్రెస్ నాయకుల పై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేయవద్దని ఆయన హెచ్చరించారు.