11 నెలలకే పెళ్ళి చేశారు…నాకొద్దా పెళ్ళి, నేను టీచర్ కావాలంటూ పట్టుబట్టి విజయం సాధించింది.! రియల్ స్టోరీ!!!

పురాతన సాంప్రదాయాలు, మడికట్టుకున్న సిద్దాంతాలు, కంచెలా మారిన కట్టుబాట్లు… వీటన్నింటి మీద విజయం సాధించింది ఆమె.అవును ఆమె గెలిచింది, మరో మహిళ ఆమెను గెలిపించింది.

రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన 19యేళ్ళ యువతి యధార్థ జీవిత గాథ ఇది.ఏందరికో స్పూర్తిదాయకమైంది.ఆమె పేరు శాంతాదేవి మేఘ్వాల్.

ఆమె చిన్నప్పుడు అంటే 11 నెలలకే అదే ఊరికి చెందిన శాంతారామ్ కు ఇచ్చి పెళ్ళి చేశారు.పెళ్ళి చేశారు కానీ ఆమెను అత్తగారింటికి పంపలేదు.

చిన్నప్పుడే పెళ్ళి చేయడం, అమ్మాయి పెద్దమనిషి అయ్యాక ఘనంగా మరోసారి ఆ పెళ్లి వేడుకను జరపడం.అప్పుడు ఆ అమ్మాయి అత్తగారింటికి పంపడం ఇది అక్కడి సాంప్రదాయం.

Advertisement

సేమ్ ఇదే పరిస్థితి శాంతాదేవికి ఎదురైంది… అమ్మాయికి 18 యేళ్ళు నిండాయి కదా .ఇక పంపించండి అంటూ వాళ్ళింటికి వచ్చి కూర్చున్నారు అత్తగారి తరఫు వాళ్లు.శాంతాదేవి షాక్ కు గురైంది.

అప్పటి వరకు తనకు పెళ్ళైన సంగతి ఆమెకు తెలియదు.తనకు 11 నెలలకే పెళ్ళైందా అంటూ ఆశ్చర్యపోయింది!.

నేను వెళ్లను ,అసలు నాకు ఆ పెళ్ళే ఇష్టం లేదు, , నేను టీచర్ అవ్వాలి అంటూ చెప్పేసింది అందరి ముందే శాంతాదేవి.

దాని కోసం న్యాయపోరాటం స్టార్ట్ చేసింది.ఫ్యామిలీ కోర్టులో తన పెళ్ళి చెల్లదని పిర్యాదు చేసింది.ఈ విషయం తెలుసుకున్న భర్త తరఫు వాళ్ళు గ్రామ పంచాయితికి పిర్యాదు చేశారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

దీంతో ఆ గ్రామ పంచాయితీ.తమ పురాతర సంప్రదాయాన్ని వ్యతిరేకించినందుకు ఆమెను … కులబహిష్కరణ చేయడమే కాక సుమారు 16 లక్షల రూపాయలు జరిమానా కూడా విధిచారు.

Advertisement

ఈ ఘటనపై కూడా న్యాయపోరాటం గట్టిగా స్టార్ట్ చేసింది శాంతాదేవి, ఈ విషయంలో ఆమెకు బాల్య వివాహాల కార్యకర్త భారతి చాలా హెల్ప్ చేసింది.ఎన్నో వాయిదాల అనంతరం జోధ్ పూర్ స్థానిక ఫ్యామిలీ కోర్టు ఆమె వివాహాన్ని రద్దు చేస్తూ అక్టోబర్ 20న ఆదేశాలు జారీ చేసింది.

గ్రామ పంచాయితీ తీర్పు కూడా చెల్లదని స్పష్టం చేసింది ఆ కోర్టు…దీంతో శాంతాదేవి తన మొదటి లక్ష్యాన్ని చేరుకుంది.ఇప్పుడు తన దృష్టంతా టీచర్ అవ్వడం మీదే….

దాని కోసం అహర్నిషలు ప్రయత్నిస్తుంది శాంతాదేవి.అంతే కాదు బాల్యవివాహాలపై అవగాహనా కార్యక్రమాలను కూడా చేపడుతుంది.

#ఆల్ ది బెస్ట్ సిస్టర్.

తాజా వార్తలు