తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి సుధా గురించి అందరికీ సుపరిచితమే.కెరియర్ మొదట్లో హీరోయిన్ గా నటించిన సుధా అనంతరం తల్లి పాత్రలలో ఎంతో ఒదిగిపోయినటించారు.
ప్రస్తుతం ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి పలు విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా సుధా మాట్లాడుతూ తను పుట్టుకతోనే డైమండ్ స్పూన్ తో పుట్టానని ఇంట్లో పని వాళ్లు కారు డ్రైవర్లు ఒక రాజసంగా బతికానని తెలిపారు.
అయితే నాన్నకు ఎప్పుడైతే క్యాన్సర్ అని తెలిసిందో ఆ క్షణం మాకు బంధువులు కూడా దూరం అయ్యారని, మా ఆస్తి కూడా కర్పూరంలా కరిగిపోయిందని సుధా తెలిపారు.ఇలా నాన్న క్యాన్సర్ తో మరణించడం ఆస్తులు మొత్తం వెళ్లిపోవడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని ఆ సమయంలో మా కడుపు నింపడం కోసం అమ్మ తన మంగళసూత్రం కూడా అమ్మి మాకు భోజనం పెట్టిందని తెలిపారు.
అయితే అమ్మ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో తనని ఇండస్ట్రీలోకి పంపించారని సుధా తెలిపారు.
ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు డబ్బు రావడంతో తిరిగి చుట్టాలందరూ తమని పలకరిస్తూ మా చెంతకు చేరారు.ఇక ఇండస్ట్రీలో సంపాదించడం మొత్తాన్ని ఢిల్లీలో హోటల్ పెట్టుబడి పెట్టాము.
అయితే ఒక సంతకంతో దాదాపు 100 కోట్ల వరకు నష్టపోయామని సుధా తెలిపారు.ఇక తన భర్త కుమారుడు గురించి కూడా ఈమె మాట్లాడుతూ ప్రస్తుతం వాళ్లు అమెరికాలో ఉంటున్నారని తన కుమారుడు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకొని నాతో గొడవ పడి అమెరికాలోనే ఉన్నారని తెలిపారు.ప్రస్తుతం తాను ఒంటరిగా ఇక్కడ ఉన్నానని సుధా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.