యంగ్ హీరో మృతి.. క్యాన్సర్ తో పోరాటం.. అప్పుడే కరోనా!

తాజాగా సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం చోటుచేసుకుంది.అస్సామీ నటుడు కిషోర్ దాస్ తాజాగా అనారోగ్యం కారణంగా తదిత్వాస విడిచారు.30 ఏళ్ల నటుడు కిషోర్ దాస్ క్యాన్సర్ తో పోరాడుతూ తాజాగా కన్నుమూశాడు.ఇక మార్చి నెల నుంచి చెన్నై ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న కిషోర్ కు కరోనా సోకినట్లు తెలిపారు.

 Assamese Actor Kishor Das Dies Age 30 After Battle Cancer Details, Actor Kishor,-TeluguStop.com

క్యాన్సర్ తో పోరాడుతున్న అతడికి కరోనా సోకడంతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.కిషోర్ దాస్ అంత్యక్రియలను చెన్నైలోనే నిర్వహించనున్నారు.కాగా కరోనా ప్రోటోకాల్ కారణంగా అతని మృతదేహాన్ని అస్సాంలో ఉన్న కామ్ రూప్ లో ఉన్న అతని స్వస్థలానికి పంపించలేదు.

కిషోర్ దాస్ అస్సామీ వినోద పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇతనికి యూత్ లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఇతను బందున్, విధాత, నేదేఖ పాగున్, లాంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే కేవలం సీరియల్స్ లో మాత్రమే కాకుండా దాదాపుగా 300కు పైగా మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిషోర్ దాస్.అదేవిధంగా సంగీత ప్రియులకు కూడా అభిమానులుగా మారాడు.

తురుట్ తురుట్ అనే సాంగ్ తో ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగిపోయాడు కిషోర్ దాస్. 2019లో క్యాండిడేట్ యంగ్ అచీవ్మెంట్ అవార్డును కూడా పొందాడు.కిషోర్ దాస్ మృతితో ఒక్కసారిగా అస్సామీ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.కిషోర్ దాస్ అకాల మరణం పై అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి కేశబ్ మహంతా స్పందించారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేశారు.కిషోర్ దాస్ మరణ వార్త విన్నసిని ఇండస్ట్రీ ఒక్కసారిగా తీవ్ర దిబ్బంతికి లోనైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube