అస్సాం రాష్ట్రంలో చాలా సంవత్సరాల క్రితం నుంచి తీవ్రవాద సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.అస్సాం రాష్ట్రంలో 8 తీవ్రవాద సంస్థలు ఉన్నాయి.
గురువారం గౌహతిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అస్సాం ముఖ్యమంత్రి అయిన హిమంత బిశ్వశర్మ తో ఈ తీవ్రవాద సంస్థల గురించి చర్చించారు.
ఆదివాసీ పీపుల్స్,సంతాల్ టైగర్ ఫోర్స్, బిర్సా కమాండో ఫోర్స్,ఆదివాసీ కోబ్రా మిలిటెంట్ ఈ తీవ్రవాద సంస్థలతో పాటు ఆల్ ఆదివాసీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనే అస్సాం కి చెందిన తీవ్రవాద సంస్థ కూడా ఉంది.
ఈ తీవ్రవాద సంస్థలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి ఒప్పందం చేసుకున్నాయి.ఈ శాంతి ఒప్పంద పత్రాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో తీవ్రవాద సంస్థలు సంతకాలు కూడా చేశాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం అస్సాం రాష్ట్రం తో పాటు ఈశాన్య రాష్ట్రాలలో కూడా శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగనియకూడదు.ఈ ఒప్పందం వల్ల అస్సాంలో శాంతి భద్రతలతో కూడిన కొత్త శకం ప్రారంభం అవుతుందని అస్సాం ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

అస్సాంలో ఇంకో కరుడుగట్టిన తీవ్రవాద సంస్థ కమతాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ శాంతి ఒప్పందం పై సంతకం చేయలేదు.ఈ సంవత్సరం జనవరి లో తివా లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు అస్సాం ప్రభుత్వం ముందు లొంగిపోయారు.2020వ సంవత్సరంలో 4100 మంది తీవ్రవాద సంస్థకు చెందిన సభ్యులు అస్సాం ప్రభుత్వం ముందు లొంగిపోయారు.అస్సాం రాష్ట్రం గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ ఉగ్రవాద రహిత, మాదక ద్రవ్య రహిత రాష్ట్రాలుగా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయాలన్నారు.







