భారతదేశానికి రాజధాని ఢిల్లీ అని అందరికీ తెలుసు.అయితే తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత భీశ్వశర్మ దేశానికి ఐదు రాజధానులు ఉండాలని డిమాండ్ చేశారు.
ఈ విధంగా వ్యవహరిస్తే ప్రాంతీయల మధ్య అసమానతలు తొలగిపోతాయని పేర్కొన్నారు.ప్రతి జోన్ లో ఒకటి చొప్పున ఐదు రాజధానులు ఏర్పాటు చేయడంపై అందరం దృష్టి సారించాలి.
అప్పుడే ఢిల్లీ లాంటి ఒకే చోట సంపద పోగుబడటం అనేది ఉండదు.ఢిల్లీని లండన్, పారిస్ మాదిరిగా మారుస్తామని చెప్పిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అరవింద్ కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాలను ఎగతాళి చేయడం ఒక అలవాటుగా మారింది.ఈ క్రమంలో అన్నిచోట్ల అభివృద్ధి జరిగేలా ఐదు రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్పష్టం చేశారు.
ఇక నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ సైన్య రాష్ట్రాల అభివృద్ధి పథంలోకి తెచ్చే ప్రక్రియ ప్రారంభమైందని అస్సాంలో.ఆరోగ్యం విద్య మరియు ప్రాథమిక సౌకర్యాల విస్తరణ కోసం వేగవంతమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా అస్సాం ముఖ్యమంత్రి దేశానికి ఐదు రాజధానులు ఉండాలి అని.వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.







