తల్లికి గిఫ్టుగా కారు కొని సర్ప్రైజ్ చేసిన అషు రెడ్డి... ఫోటోలు వైరల్!

Ashu Reddy Surprised Her Mother By Buying A Car As A Gift Details, Bigg Boss,Ramgopal Varma,Ashu Reddy, Ashu Reddy Mother, Ashu Reddy Mother Birthday, Ashu Reddy Gift, Actress Ashu Reddy, Ashu Reddy Movie Offers

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీగా కొనసాగుతున్నటువంటి వారిలో బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి(Ashu Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టిక్ టాక్(Tik Tok) వీడియోల ద్వారా ఫేమస్ అయినటువంటి ఈమె అచ్చం సమంత పోలికలతో ఉండడంతో జూనియర్ సమంత అంటూ పెద్ద ఎత్తున ఈమెని అభిమానించి ఆదరించారు.

 Ashu Reddy Surprised Her Mother By Buying A Car As A Gift Details, Bigg Boss,ram-TeluguStop.com

ఇలా టిక్ టాక్ వీడియోలతో ఎంతో ఫేమస్ అయినటువంటి అషు రెడ్డి అనంతరం బిగ్ బాస్(Bigg Boss) అవకాశాన్ని అందుకున్నారు.బిగ్ బాస్ ద్వారా మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈమె బుల్లితెర కార్యక్రమాలు అలాగే వెండి తెరపై సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు.

ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తరచూ బోల్డ్ ఫోటోషూట్స్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు కొన్నిసార్లు శృతిమించిన అందాలను ఆరబోస్తూ నేటిజన్లో ట్రోలింగ్ కూడా గురవుతూ ఉన్నారు.ఇలా ఎవరు ఏమన్న డోంట్ కేర్ అనే విధంగా అషు రెడ్డి వ్యవహార శైలి ఉంటుంది ముఖ్యంగా ఈమె రామ్ గోపాల్ వర్మతో(Ramgopal Varma) కలిసి చేసినటువంటి ఇంటర్వ్యూ సంచలనంగా మారింది.ఇలా పలు విషయాల ద్వారా తరచు వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ తాజాగా తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా తన తల్లికి ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ సంతోషపెట్టారు.

అషు రెడ్డి తల్లి పుట్టిన రోజు కావడంతో ఈమె తన తల్లికి సుజుకి కారును కానుకగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.ఇలా తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా అషు రెడ్డి కారు కీస్ తన చేతిలో పెట్టడంతో ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేసి ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఈ ఫోటోలు వీడియోలపై నెటిజన్స్ స్పందిస్తూ చాలా మంచి పని చేశావు అంటూ తనని అభినందిస్తూ కామెంట్లు చేశారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube