బి. సుమ‌తి ఐపీఎస్ రిలీజ్ చేసిన ఫోక‌స్ చిత్రంలోని అషు రెడ్డి స్పెష‌ల్ లుక్ పోస్ట‌ర్

యంగ్ హీరో విజ‌య్ శంక‌ర్, బిగ్‌బాస్ ఫేమ్‌ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం `ఫోక‌స్`.సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నఈ చిత్రానికి జి.సూర్య‌తేజ ద‌ర్శ‌కుడు.మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ఉత్కంఠ‌మైన క‌థ క‌థ‌నాల‌తో న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది.

 Ashu Reddy Special Look Poster In Focus Movie Released By B. Sumathi Ips , Focu-TeluguStop.com

ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా ఇటీవ‌ల విడుద‌లైన ఫోక‌స్ మూవీ టీజ‌ర్ ఐదు ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో విశేష ఆద‌ర‌ణ సొంతం చేసుకుంది.ఈ చిత్రంలో అషురెడ్డి మొద‌టిసారిగా పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుంది.

తాజాగా ఆమె లుక్‌ను బి.సుమతి ఐపీఎస్‌ (డీఐజీ, మహిళా భద్రతా విభాగం) విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు జి.సూర్య‌తేజ మాట్లాడుతూ – “ ఫోక‌స్ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్త‌య్యింది.ఔట్ పుట్ ప‌ట్ల మా యూనిట్ అంద‌రం చాలా సంతోషంగా ఉన్నాం.అతి త్వ‌ర‌లో ఒక స్టార్ హీరోతో ఫోక‌స్ మూవీ ట్రైల‌ర్‌ని లాంచ్ చేయ‌బోతున్నాం.ఇప్ప‌టి వ‌ర‌కు మాకు స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్‌.త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.

స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

నటీ నటులు: విజయ్‌ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని, భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, రఘు బాబు,సూర్య భగవాన్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి…

సాంకేతిక బృందం

డైరెక్టర్‌: జి.సూర్యతేజ, నిర్మాణం: రిలాక్స్‌ మూవీ మేకర్స్‌, సమర్ఫణ: స్కైరా క్రియేష‌న్స్‌, ఎడిటర్‌: సత్య.జీ , డీఓపీ: జే.ప్రభాకర్‌ రెడ్డి సంగీతం: వినోద్‌ యజమాన్య,లిరిసిస్ట్: కాస‌ర్ల శ్యాం

4 Attachments

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube