Ashu Reddy Surekhavani: డ్రగ్స్ కేసులో కేపీ చౌదరితో ఆ సెలబ్రిటీలకు సంబంధాలు.. అషుతో పాటు సురేఖా వాణి కూడా?

తాజాగా టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కేసు( Drugs Case ) హాట్ టాపిక్ గా మారింది.డ్రగ్స్ కేసులో భాగంగా సినీ నిర్మాత కేపీ చౌదరిని( Producer KP Chowdary ) సైబారాబాద్ పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ సాగించారు.కాగా ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.100 కొకైన్ ప్యాకెట్ల గోవా నుంచి తీసుకుని రాగా అందులో 90 ప్యాకెట్లను సీజ్ చేశారు.అయితే మిగిలిన 10 ప్యాకెట్లను ఎవరికి అమ్మారు అన్న దానిపై పోలీసులు విచారణ జరుపగా కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు పేర్లు వెలుగులోకి వచ్చాయి.కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో బిగ్ బాస్ అషురెడ్డితో( Ashu Reddy ) పాటుగా చాలామంది సెలబ్రిటీల పేర్లు ఉండటంతో అషురెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు.

 Ashu Reddy And Others Names In Kp Chowdary Call List In Tollywood Drugs Case-TeluguStop.com
Telugu Actress Jyothi, Ashu Reddy, Drugs, Kp Chowdary, Surekha Vani, Tollywood,

అషుతో పాటు నటి జ్యోతి,( Actress Jyothi ) సురేఖావాణి ( Surekhavani ) ఇతర ప్రముఖ నటీమణులతో కేపీ చౌదరి సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఉండటంతో.అటు వైపు నుంచి కూడా విచారణ సాగిస్తున్నారు.కాల్ లిస్ట్‌ని డీకోడ్ చేయగా కేపీ చౌదరి-అషురెడ్డిల మధ్య వందల ఫోన్ కాల్స్ ఉన్నట్టు తెలుస్తోంది.కాగా అషురెడ్డి కదలికలపై కూడా పోలీసులు అనూమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆమె ఎక్కువగా విదేశాల్లోనే ఉంటారు.సినిమాలు, సీరియల్స్, ఇతర షోలు ఏమీ చేయకపోయినా అషురెడ్డి లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఎక్కువగా విదేశాల్లో షికార్లు చేస్తుంటారు.

Telugu Actress Jyothi, Ashu Reddy, Drugs, Kp Chowdary, Surekha Vani, Tollywood,

ఆమెకు అంత లగ్జరీ లైఫ్ ఎలా వస్తుందనే అనుమానాలు చాలామందిలో వ్యక్తం అవుతుండగా ఇప్పుడు అషురెడ్డి పేరు కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో ఉండటం హాట్ టాపిక్‌గా మారింది.కానీ కేపీ చౌదరి వాదన మాత్రం మరోలా ఉంది.తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని సెలబ్రిటీలకు ఎవరికీ తాను డ్రగ్స్ అందించలేదంటూ మరో ట్విస్ట్ ఇచ్చారు.ఫోన్‌లో నెంబర్లు ఉన్నంత మాత్రాన డ్రగ్స్ అమ్మినట్టా? అంటూ ప్రశ్నించారు.నేను డ్రగ్స్ తీసుకుంటా అవి నాకోసమే తప్ప అమ్మడానికి కాదని వివరణ ఇచ్చారు కేపీ చౌదరి.కానీ విచారణ తర్వాత కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఒప్పుకున్నారని12 మంది పేర్లను కూడా లీక్ చేసినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube