టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ ఎవరో చెప్పేసిన అశోక్ గల్లా!

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి మనవడు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరో సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 15వ తేదీన విడుదల చేసారు.

ఆయన సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది.ప్రెసెంట్ ఈ సినిమా థియేటర్ లో రన్ అవుతూ ఉంది.

ఈ సందర్భంగా గల్లా అశోక్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.శ్రీరామ్ నాకు ఈ కథను వినిపించినప్పుడే.

చాలా కమర్షియల్ గా చేయాలి అనుకుంటున్నట్టు చెప్పాడు.ఈ సినిమా స్టార్ట్ నుండి ఎండింగ్ వరకు నవ్విస్తూనే ఉండేలా తీయాలి అనుకుంటున్నానని అన్నాడు.

Advertisement

ఆయన అంతకు ముందు తీసిన సినిమాలు చూసి ఆ నమ్మకంతో ఓకే చెప్పానని అన్నాడు.ఇక ఈ సినిమా షూటింగ్ జరిగేప్పుడు ఎవ్వరు కూడా నన్ను కొత్త హీరోలా చూడలేదు.

దీంతో నేను కామెడీ బాగా చేయగలిగాను.నేను చెన్నై లో డ్యాన్స్ నేర్చుకున్నాను.ఇక ఈ సినిమాకి ముందుగానే విజయ్ మాస్టర్ నాతొ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించాడు.

ఈ సందర్భంగా మన టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లు ఎవరు అనే దానిపై కూడా కామెంట్ చేసాడు గల్లా అశోక్.

అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్ ముగ్గురు కూడా మంచి డ్యాన్సర్లు.ఆ ముగ్గురిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరో చెప్పడం మాత్రం కష్టం.ఎన్టీఆర్ నాచురల్ డ్యాన్సర్.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

ప్రాక్టీస్ లేకపోయినా ఆయన ఇరగ దీయగలడు.ఇక చరణ్ డ్యాన్స్ విషయానికి వస్తే ఆయన డ్యాన్స్ లో ఒక గ్రేస్ ఉంటుంది.

Advertisement

అల్లు అర్జున్ ఇక మనం చూడని స్టెప్పులను కూడా ఎక్కడి నుండో తెచ్చిపెడతారాయన.అంటూ గల్లా అశోక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

ఇక హీరో సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించినందుకు ధన్యవాదాలు చెప్పాడు.ప్రస్తుతం మరొక స్క్రిప్ట్ మీద చర్చ జరుగుతుంది.

త్వరలోనే దీనిపై అన్ని విషయాలు చెబుతాను అని తెలిపాడు.

తాజా వార్తలు