ఆశిష్ విద్యార్థి(Ashish Vidyarthi) 60 ఏళ్ల వయసులో గువాహటికి చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రుపాలీ బరూవాను(Rupali Baruvaa) వివాహమాడిన సంగతి మనకు తెలిసిందే.ఇలా 60 సంవత్సరాలు వయసులో ఈయన రెండో పెళ్లి చేసుకోవడంతో చాలామంది ఈ జంటపై విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు.
ఇలా తమ పెళ్లి గురించి ఇలాంటి ట్రోల్స్ వస్తున్నటువంటి తరుణంలో ఆశీస్సు విద్యార్థి పలుమార్లు ఈ ట్రోల్స్ పై స్పందిస్తూ వాటిని తిప్పి కొట్టారు.పెళ్లి అంటే కేవలం శారీరక సంబంధం మాత్రమే కాదని జీవితంలో మనకంటూ ఒక తోడు ఉండటం కోసమే పెళ్లి చేసుకుంటారు అంటూ ఈయన చెప్పుకొచ్చారు.
ఇలా వీరి వివాహం జరిగి సుమారు 6 నెలలు అవుతున్నప్పటికీ ఇంకా వీరి గురించి ఏమాత్రం ట్రోల్స్( Trolls ) ఆగడం లేదు.అయితే తాజాగా ఆశిష్ విద్యార్థి భార్య రూపాలి వారి పెళ్ళి గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.తమపై వచ్చిన అసభ్య వ్యాఖ్యలను చదివినప్పుడు వారి మనస్సులో ఏమి ఉందని ప్రశ్నించగా రుపాలీ( Rupali ) ఇలా స్పందించారు.నన్ను తిడుతున్నటువంటి వారెవరో కూడా నాకు తెలియదు కాబట్టి నేను ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోనని ఈమె సమాధానం చెప్పారు.
ఇలా మనకు తెలియని వారు మన గురించి మాట్లాడినప్పుడు వాటి గురించి పట్టించుకుని బాధ పడాల్సిన అవసరం లేదని ఈమె తెలియజేసారు.నేను నా జీవితంలో ఏమి కోల్పోయానో నాకు మాత్రమే తెలుసు.ఇలాంటి వయసులో నాకు ఒక తోడు దొరకడం నిజంగానే ఒక అదృష్టం.ఆ ఆశీర్వాదం చాలా పెద్దది.ఈ విషయంపై ప్రతికూలతలు వచ్చినా అవి తాత్కాలికమే అంటూ రూపాలి తమ రెండవ పెళ్లి( Second Marriage ) గురించి వస్తున్నటువంటి విమర్శలపై స్పందిస్తూ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.