నాగ్ సరసన ఆ యంగ్ భామ ఫిక్స్.. ఎవరంటే?

అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.

గతంలో వరుస హిట్స్ తో దూసుకు పోయిన నాగ్ గత కొద్దీ రోజులుగా హిట్స్ అనేవి దక్కడం లేదు.

నాగార్జున ది ఘోస్ట్( The Ghost ) సినిమాతో భారీ ప్లాప్ అందుకున్న తర్వాత కొద్దీ రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.ఇక ఈ మధ్యనే కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు.

ఇటీవలే నాగార్జున తన కొత్త సినిమాను చాలా గ్యాప్ తర్వాత అనౌన్స్ చేసిన విషయం విదితమే.నా సామిరంగ ( Naa Saami Ranga )అనే టైటిల్ తో నాగార్జున ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా ఈ టీజర్ ఫ్యాన్స్ ను చాలా ఆకట్టుకుంది.

ఫస్ట్ ఇంప్రెషన్ నే బెస్ట్ అనిపించుకుని చాలా రోజుల తర్వాత ఈయన సినిమాపై మంచి అంచనాలు పెరిగేలా చేసాడు..నాగ్ ఈ సినిమా కోసం మాస్ మేకోవర్ లోకి మారి పోయాడు.ఈ మేకోవర్ ఫ్యాన్స్ ను బాగా అలరించింది.2024 సంక్రాంతి బరిలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది అని సినిమా ప్రకటన రోజే చెప్పి మరింత క్యూరియాసిటీ పెంచేసాడు.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బిజీ డైరెక్ట్ చేయబోతున్నాడు.

Advertisement

ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదొక వార్త సినిమాపై హైప్ పెంచేస్తునే ఉంది.తాజాగా హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అయ్యింది.ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్ లను పరిశీలించి చివరకు కన్నడ భామ ఆషికా రంగనాథ్( Ashika Ranganath ) ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

ఈ భామ ఇప్పటికే కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని టాక్.మరి ఆ రోల్ కోసం ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి.

కాగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు